Narender Vaitla | Edited By: Subhash Goud
Jul 22, 2021 | 9:12 AM
ఇటీవల టెక్ కంపెనీల మధ్య ఒప్పందాలు బాగా జరుగుతున్నాయి. ముఖ్యంగా వినూత్న ఐడియాలజీతో వచ్చిన స్టార్టప్‌లను కొనుగోలు చేయడానికి దిగ్గజ సంస్థలు ముందుకొస్తున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ భారత్‌కు చెందిన 'సిమ్‌సిమ్' (SimSim) అనే స్టార్టప్‌ను కొనుగోలు చేసింది.
ఉత్పత్తులకు వీడియో రూపంలో ప్రచారం కల్పించడం ఈ సిమ్‌సిమ్ ప్రత్యేకత. దీంట్లో వివిధ ఉత్పత్తులకు సంబంధించిన వీడియోలను అప్‌లోడ్ చేస్తారు. వాటిని చూసిన యూజర్లు.. సదరు ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు.
ఈ డీల్ ద్వారా చిన్న వ్యాపారాలను, రిటైలర్లను కొత్త కస్టమర్ల వద్దకు చేర్చేందుకు సహకరిస్తామని యూట్యూబ్ వెల్లడించింది. అయితే ఈ డీల్ విలువ ఎంతనే విషయాలు మాత్రం తెలియలేదు.
అయితే ఇప్పటికిప్పుడు సిమ్‌సిమ్‌లో ఎలాంటి మార్పులు చేయడంలేదని పాత విధానాన్నే కొనసాగిస్తామని యూట్యూబ్ తెలిపింది.
ప్రపంచ ప్రఖ్యాత సంస్థ భారత్‌కు చెందిన ఓ స్టార్టప్‌ను కొనుగోలు చేయడం నిజంగానే గొప్ప విషయం కదూ.!