xiaomi pro QLED: కొత్త టీవీని లాంచ్‌ చేస్తున్న షావోమీ.. క్యూఎల్‌ఈడీ స్క్రీన్‌తో..

|

Aug 26, 2024 | 1:08 PM

చైనాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం షావోమీ ఓవైపు ఫోన్‌లతో పాటు మరోవైపు స్మార్ట్‌ టీవీలను సైతం తీసుకొస్తోంది. ఇంఉలో భాగంగానే తాజాగా మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ టీవీని తీసుకొచ్చే పనిలో పడింది. షావోమీ ప్రో క్యూఎల్‌ఈడీ పేరుతో ఈ టీవీని తీసుకొస్తున్నారు. ఈ టీవీలో ఎలాంటి పీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
చైనాకు చెందిన షావోమీ భారత మార్కెట్లోకి కొత్త టీవీని తీసుకొస్తోంది. షావోమీ ఎక్స్‌ ప్రో క్యూఎల్‌ఈడీ పేరుతో ఈ టీవీని తీసుకొస్తున్నారు. ఆగస్టు 27వ తేదీన ఈ టీవీ లాంచ్‌ కానుంది. ఇందులో భాగంగా 43 ఇంచెస్‌, 55 ఇంచెస్‌, 65 ఇంచెస్‌తో టీవీలను తీసుకొస్తున్నారు.

2 / 5
షావోమీ టీవీలో మ్యాజిక అనే ఫీచర్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా యూజర్లకు వైబ్రంట్ కలర్ ఎక్స్‌పీరియన్స్ పొందే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఈ టీవీ స్క్రీన్‌ ఫినిషింగ్‌లు మెటల్‌లో డిజైన్‌ చేశారు.

3 / 5
ఈ టీవీల్లో సినిమాటిక్ ఆడియో ఎక్స్‌పీరియన్స్‌ అందించేలా స్పీకర్‌లను అందించనున్నారు. షావోమీ ఎక్స్ ప్రో క్యూఎల్ఈడీ టీవీలు ప్యాచ్ వాల్ ఇంటర్ ఫేస్, గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టంలను అందించనున్నారు. ఈ టీవీలో 32 జీబీ స్టోరేజ్‌ కెపాసిటీ ఉండనుంది.

4 / 5
ఎమ్‌ఐ.కామ్‌తో పాటు ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌ కార్ట్‌లో ఈ టీవీ అందుబాటులోకి రానుంది. కాగా ధరకు సంంధించిన కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆగస్టు 27వ తేదీన దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయనున్నారు.

5 / 5
ఇదిలా ఉంటే.. షావోమీ గతేడాది షావోమీ.. ఎక్స్ ప్రో పేరుతో స్మార్ట్‌ టీవీలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో భాగంగా 40 ఇంచెస్‌, 50 ఇంచెస్‌, 55 ఇంచెస్‌ వేరియంట్స్‌లో తీసుకొచ్చారు.