
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ గ్లోబల్ మార్కెట్లోకి మిక్స్ ఫ్లిప్ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ప్రీమియం సెగ్మెంట్‌లో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ ఫోన్ 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర మన కరెన్సీలో ఏకంగా రూ. 1.21 లక్ష వరకు ఉండనుంది.

ఇక ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.86 ఇంచెస్‌తో కూడిన ఇన్నర్ స్క్రీన్‌ను అందించారు. అలాగే 4.01 ఇంచెస్‌తో కూడిన కవర్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇక ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ను అందించారు.

ప్రస్తుతం చైనా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్‌ను త్వరలోనే భారత్‌తో పాటు గ్లోబల్ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నహాలు చేస్తున్నారు. ఇక ఈ ఫోన్‌ను 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వంటి ఒకే వేరియంట్‌లో తీసుకొచ్చారు.

ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. లెయికా భాగస్వామ్యంతో ఈ కెమెరాను రూపొందించారు. దీంతో మంచి నాణ్యమైన ఫొటోలను ఈ కెమెరా ద్వారా పొందొచ్చు.

షావోమీ తీసుకొచ్చిన మొదటి ఫోల్డబుల్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇక ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో అందించిన రెండు స్క్రీన్స్‌లోనూ డాల్బీ విజన్‌తో పాటు హెచ్‌డీఆర్10+ను అందించారు.