Whatsapp: వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఇకపై మీ ఫ్రెండ్స్‌ స్టేటస్‌ పెట్టగానే

|

Apr 16, 2024 | 8:14 AM

దాదాపు స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగించే ప్రతీ ఒక్కరూ వాట్సాప్‌ను యూజ్‌ను చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. మార్కెట్లోకి ఎన్ని రకాల మెసేజింగ్ యాప్స్‌ అందుబాటులోకి వస్తున్నా వాట్సాప్‌కు ఉన్న క్రేజ్‌ మాత్ర ఏమాత్రం తగ్గడంలేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తూ, యూజర్లను...

Whatsapp: వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఇకపై మీ ఫ్రెండ్స్‌ స్టేటస్‌ పెట్టగానే
Whatsapp
Follow us on

దాదాపు స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగించే ప్రతీ ఒక్కరూ వాట్సాప్‌ను యూజ్‌ను చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. మార్కెట్లోకి ఎన్ని రకాల మెసేజింగ్ యాప్స్‌ అందుబాటులోకి వస్తున్నా వాట్సాప్‌కు ఉన్న క్రేజ్‌ మాత్ర ఏమాత్రం తగ్గడంలేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తూ, యూజర్లను ఆకట్టుకోవడమే ఈ యాప్‌కు ఇంతటి క్రేజ్‌ దక్కడానికి కారణంగా చెప్పొచ్చు.

ఓవైపు యూజర్ల ప్రైవసీకి పెద్ద పీట వేస్తూనే మరోవైపు అధునాతన ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోంది వాట్సాప్‌. వాట్సాప్‌ తీసుకొచ్చిన ఫీచర్లలో వాట్సాప్‌ స్టేటస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈ ఫీచర్‌కు ఎంతో ఆదరణ లభించింది. అయితే తాజాగా వాట్సాప్‌ ఈ స్టేటస్‌ విభాగంలో ఓ ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌ను తీసుకొస్తోందని తెలుస్తోంది. సాధారణంగా మన కాంటాక్ట్ లిస్ట్‌లో ఎవరైనా స్టేటస్‌ పెడితే అప్‌డేట్స్‌లోకి వెళ్లి చూస్తే కానీ తెలియదు.

అలా కాకుండా మీ కాంటాక్ట్ లిస్ట్‌ల ఉన్న వారు స్టేటస్‌ పెట్టగానే మీకు అలర్ట్ వస్తే భలే ఉంటుంది కదూ.! వాట్సాప్‌ ప్రస్తుతం ఇదే ఫీచర్‌పై పనిచేస్తుంది. ప్రస్తుతం టెస్టింగ్‌ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఏదైనా మెసేజ్‌ వస్తే ఎలాగైతే అప్‌డేట్ వస్తుందో ఇకపై ఎవరైనా స్టేటస్‌ పెట్టినా మిమ్మల్ని అలర్ట్‌ చేస్తుంది. ఇది యూజర్స్ యాక్టివిటీ, కనెక్టివిటీని పెంచుతుందని కంపెనీ భావిస్తోంది. తొలుత ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత ఇతర యూజర్లకు ప్రవేశ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే తాజాగా వాట్సాప్‌ ఏఐ సేవలను కూడా ప్రారంభించింది. మెటా ఏఐ పేరుతో ఓ చాట్‌బాట్‌ను ప్రవేశపెట్టింది. ఈ చాట్‌ బాట్‌ అచ్చంగా చాట్‌ జీపీటీ మాదిరి పనిచేస్తుంది. ఇందులో యూజర్లు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఏ అంశానికి సంబంధించిన ప్రశ్న అడిగినా వెంటనే చాట్‌బాట్ సమాధానం ఇచ్చేస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..