వాట్సాప్ తీసుకొస్తున్న కొత్త ఫీచర్లలో ఆన్‌లైన్ స్టేటస్‌ను హైడ్ చేసుకోవడం ఒకటి. ఈ ఫీచర్ ద్వారా యూజర్ ఆన్‌లైన్‌లో ఉన్నా కూడా హైడ్ చేసుకోవచ్చు. మీరు ఆన్‌లైన్‌లో ఉన్నా కూడా ఎదుటి వారికి ఆన్‌లైన్‌లో ఉన్నట్లు చూపించదు.
వాట్సాప్ ఇటీవల తీసుకొచ్చిన కొత్త ఫీచర్ మెసేజ్ రియాక్షన్ ఫీచర్. దీని ద్వారా యూజర్లు నేరుగా మెసేజ్‌కు ఎమోజీలతో రిప్లై ఇవ్వొచ్చు. ప్రస్తుతం ఇందుకోసం ఆరు ఎమోజీలు ఉన్నాయి. అయితే వీటికి అదనంగా వాట్సాప్ మరికొన్ని ఎమోజీలను జోడించనుంది.
వాట్సాప్‌లో ఏదైనా ఫొటోను పంపించుకునే ముందు మార్పులు చేర్పులు చేసుకేందుకు వీలుగా మీడియా ఎడిటర్ ఆప్షన్ ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దీంట్లో ఉన్న టూల్స్‌కు అదనంగా బ్లర్ టూల్‌ను తీసుకురానున్నారు. దీంతో యూజర్లు ఫొటోలను బ్లర్ చేసుకొని పంపుకోవచ్చు.
వాట్సాప్ కొత్తగా తీసుకొస్తున్న మరో ఫీచర్ ఫ్లాష్‌కాల్‌తో వెరివిఫికేషన్.. వాట్సాప్‌లోకి కొత్తగా లాగిన్ అయ్యే సమయంలో మొబైల్ నెంబర్ ద్వారా వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీని స్థానంలో ఫ్లాష్‌కాల్స్ కొత్త విధానాన్ని తీసుకురానున్నారు. దీంతో కోడ్ ఆటోమేటిగ్గా ఫ్లాష్‌కాల్స్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.
వాట్సాప్‌లో బిజినెస్ అకౌంట్స్ కోసం ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నారు. దీంతో బిజినెస్ ఖాతాదారులు ఒకేసారి 10 డివైజ్‌లలో వాట్సాప్‌ను లాగిన్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది.