WhatsApp New Feature: మరో కొత్త ఫీచర్‌ తీసుకొచ్చిన వాట్సాప్‌.. ఇకపై నోటిఫకేషన్‌లో మొత్తం మెసేజ్‌ చూసేయొచ్చు.

|

Jul 12, 2021 | 8:36 AM

WhatsApp New Feature: ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోన్న ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ను ఐఓస్‌ యూజర్ల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు. ఇంతకీ ఈ కొత్త ఫీచర్‌తో ప్రయోజనం ఏంటనేగా..

1 / 6
 ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్‌ మొదటి వరుసలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ ఫీచర్స్‌ తీసుకొస్తుంది కాబట్టే దీనికి అంత డిమాండ్‌.

2 / 6
ఇటీవల వరుసగా కొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటన్న వాట్సాప్‌ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. అయితే ఇది కేవల ఐఓస్‌ యూజర్లకు మాత్రమే.

3 / 6
సాధారణంగా వాట్సాప్‌లో మనకు ఏదైనా మెసేజ్‌ వస్తే నోటిఫికేషన్‌లో కొంత మేర మాత్రమే చూపిస్తుంది. మెసేజ్‌ ఏంటో తెలుసుకోవాలంటే యాప్‌ ఓపెన్‌ చేయాల్సిందే.

4 / 6
అలా కాకుండా నోటిఫికేషన్‌లోనే పూర్తి మెసేజ్‌ను చూసుకునే అవకాశం ఉంటే బాగుంటుంది కదూ.! ఇలాంటి ఆలోచన నుంచి ఈ కొత్త ఫీచర్‌ వచ్చింది.

5 / 6
ఇకపై ఐఓస్‌ యూజర్లు తమ వాట్సాప్‌కు వచ్చిన మెసేజ్‌లను నోటిఫికేషన్‌లోనే చదివేయొచ్చు. కొత్తగా తీసుకొచ్చిన 2.21.140.9 బీటా వర్షన్‌లో ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది.

6 / 6
అంతేకాకుండా అవతలి వ్యక్తికి మీరు మెసేజ్‌ చదివినట్లు బ్లూటిక్స్‌ కూడా చూపించవు. మెసేజ్‌లే కాకుండా ఫొటోలను కూడా ఇలా చూసుకోవచ్చు.