
చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం వివో కొత్త ట్యాబ్‌ను తీసుకొస్తోంది. వివో ప్యాడ్ ఎయిర్ పేరుతో ఈ ట్యాబ్‌ను లాంచ్ చేయనున్నారు. తాజాగా చైనాలో జరిగిన ఈవెంట్‌లో కంపెనీ వైస్ ప్రెసిడెండ్ జియా జిండ్‌గాండ్ ఈ ట్యాబ్‌ను ఆవిష్కరించారు.

మొత్తం మూడు కలర్స్‌లో ఈ ట్యాబ్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ట్యాబ్ బరువు 530 గ్రాములు ఉంటుంది. ఇక 6.67 మి.మీల మందంతో ఉంటుంది.

వివో ప్యాడ్ ఎయిర్ ట్యాబ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఈ ట్యాబ్‌లో 11.5 ఇంచెస్ డిస్‌ప్లేను అందించారు. 2.8కే రిజల్యూషన్, 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ ట్యాబ్ ప్రత్యేకత.

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ట్యాబ్‌లో 44వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 8500 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు. భారీ బ్యాటరీ ఈ ట్యాబ్ మరో ప్రత్యేకతగా చెప్పొచ్చు.

ఫ్రీ బ్లూ, బ్రేవ్ పింక్, ఈజీ పింక్ కలర్స్‌లో ఈ ట్యాబ్ అందుబాటులోకి రానుంది. త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి రానున్న ఈ ట్యాబ్ ధరకు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.