
బ్లూవుడ్ బ్రాండ్ కు చెందిన స్కిడ్జో ఇంజినీర్డ్ వుట్ టీవీ యూనిట్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీనిలో ప్రత్యేక అల్మరాలతో కూడిన క్యాబినెట్లు ఏర్పాటు చేశారు. ఈ యూనిట్ పై నీరు పడినా ఎటువంటి నష్టం కలగదు. శుభ్రం చేసుకోవడం కూడా చాలా సులభం. సౌండ్ బార్ ప్లేస్ మెంట్, ఎలివేటెడ్ డెక్ అదనపు ప్రత్యేకతలు, అధిక నాణ్యత కలిగిన కలపతో తయారు చేసినందున ఎక్కువ కాలం మన్నుతుంది. దీని హైశ్లాబ్ లో డీవీడీ ప్లేయర్లు, సౌండ్ బార్లు ఉంచుకోవచ్చు. లివింగ్ రూమ్, బెడ్ రూమ్ లలో పెట్టుకోవచ్చు. అమెజాన్ లో రూ.4,999కి ఈ టీవీ యూనిట్ అందుబాటులో ఉంది.

క్లోవర్ క్రాఫ్ట్స్ టీవీ వాల్ యూనిట్ మీ ఇంటికి ఎంతో అందాన్ని ఇస్తుంది. 90 సెంటీమీటర్ల పొడవు, 21 సెంటీ మీటర్ల వెడల్పు, 11 సెంటీమీటర్ల ఎత్తుతో ఏ గదికైనా చక్కగా నప్పుతుంది. ఇంజినీర్డ్ కలపతో తయారు చేయడంతో మంచి బలంగా ఉంటుంది. దీన్ని ఫ్లోటింగ్ టీవీ క్యాబినెట్ అని చెప్పవచ్చు. వాల్ స్క్రూలు, వాల్ ఫ్లగ్ లతో వచ్చే ఈ యూనిట్ ను గోడకు ఇన్ స్టాల్ చేయడం చాలా సులభం. అమెజాన్ లో రూ.1,298కి దీన్ని కొనుగోలు చేసుకోవచ్చు.

ఎస్టాంటెరియా బ్రాండ్ నుంచి విడుదలైన టీవీ వాల్ యూనిట్ అదిరే లుక్ తో ఆకట్టుకుంటోంది. ఇంజినీర్డ్ కలపతో తయారు చేసిన ఈ యూనిట్ ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. ఫొటో ఫ్రేమ్ లు, పురాతన వస్తువులను టీవీ చుట్టూ ఉంచడానికి వీలుంటుంది. ఫ్లోటింగ్ డిజైన్ కారణంగా దీన్ని ఇన్ స్టాలేషన్ సమయంలో నేలకు ఎటువంటి నష్టం కలగదు. దీన్ని డీఐవై మాన్యువల్ తో ఇన్ స్టాల్ చేయడం చాలా సులభం. మీ ఇంటికి స్లైలిష్ లుక్ ఇచ్చే ఎస్టాంటెరియా టీవీ వాల్ యూనిట్ ను అమెజాన్ లో 1,499కు కొనుగోలు చేయవచ్చు.

నాణ్యత గల కలప, ఆకట్టుకునే డిజైన్ లో స్పేస్ టీవీ స్టాండ్ ను రూపొందించారు. మీడియం నుంచి చిన్న సైజు లీవింగ్ రూమ్ లకు, ఆఫీసుల్లో చక్కగా సరిపోతుంది. మీ టీవీతో పాటు ఇష్టమైన పుస్తకాలు, మొక్కలు, వివిధ వస్తువులను పెట్టుకోవచ్చు. వాటికి సరిపడే ర్యాక్ తో అందంగా తీర్చిదిద్దారు. తక్కువ స్థలంలో ఈ టీవీ స్టాండ్ ను అమర్చుకునే వీలు ఉంది. క్యాబినెట్ కింద ఎల్ఈడీ లైట్లను సెట్టింగ్ చేసుకోవచ్చు. కేవలం ఐదు కిలోల బరువుతో ఇంజినీర్డ్ వుడ్ తో తయారు చేసిన స్పేస్ టీవీ స్టాండ్ అమెజాన్ లో రూ.2,699కి అందుబాటులో ఉంది.

మన్నికైన టీవీ యూనిట్ కొనుగోలు చేయాలనుకునే వారికి వేక్ ఫిట్ బ్రాండ్ మంచి ఎంపిక. దీన్ని 15 నుంచి 18 సెంటీమీటర్ల మందంతో ఇంజినీర్డ్ కలపతో తయారు చేశారు. ఏ ఇంటికైనా చక్కగా సరిపోతుంది. ముఖ్యంగా హాలుకు మరింత అందాన్ని ఇస్తుంది. దీనిలో ఐదు షెల్ఫ్ లు ఏర్పాటు చేశారు. వీటిలో పుస్తకాలు, బట్టలు, సెటప్ బాక్స్ లను చక్కగా ఉంచుకోవచ్చు. మంచి కలప కారణంగా ఎక్కువ కాలం మన్నుతుంది. ఈ టీవీ యూనిట్ ను అమెజాన్ లో రూ.5,516కి అందుబాటులో ఉంచారు.