1 / 5
శీతాకాలం దాదాపు ముగిసింది. వేసవి కాలం ప్రారంభమైంది. ఎండాకాలం మొదట్లోనే ఎండలు మండిపోతున్నాయి. తీవ్రమైన వేడి నుండి తప్పించుకోవడానికి చాలా మంది ఎయిర్ కండిషనింగ్ ఆధారపడి ఉంటారు. ఎండాకాలంలో చాలా మంది ఇళ్లలో ఏసీలు వాడుతుంటారు. కానీ వర్షాకాలం, చలికాలంలో ఏసీలు పెద్దగా వాడరు. అందుకే ఏసీలు కాస్త జామ్ అయి మురిగి పేరుకుపోతుంటుంది. దానిని శుభ్రం చేయకపోతే చల్లని గాలి రాదు. శుభ్రం చేసేందుకు మెకానిక్‌ను పిలిస్తే ఖర్చు భారీగానే ఉంటుంది. అందుకే డబ్బులను ఆదా చేసుకోవాలంటే మీ ఇంట్లో ఉన్న ఏసీని మీరే శుభ్రం చేసుకోవచ్చు.