
ఏసర్ స్మార్ట్ చాయిస్ ఏస్పైర్ లైట్ ల్యాప్ టాప్ లోని ఏఎండీ రైజెన్ 3 5300యూ ప్రాసెసర్ తో పనితీరు చాలా సమర్థంగా ఉంటుంది. 15.6 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే, స్టీల్ గ్రే కలర్ లోని ప్రీమియం మెటల్ బాడీ, 8 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజీ, విండోస్ 11 హోమ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ కోసం,ముఖ్యంగా విద్యార్థులకు చాలా బాగా ఉపయోగపడుతుంది. 1.6 కిలోల బరువు కలిగిన ఈ ల్యాప్ టాప్ అమెజాన్ లో రూ.28,990కి అందుబాటులో ఉంది.

ఆఫీసు పనిచేసుకోవడానికి, వినోద కార్యక్రమాలు చూడటానికి, వివిధ విషయాలను అధ్యయనం చేయడానికి డెల్ ల్యాప్ టాప్ బాగుంటుంది. 8 జీబీ ర్యామ్, 512 జీజీ స్టోరేజీ, 15 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే, విండోర్ 11, 1.69 కిలోల బరువు దీని ప్రత్యేకతలు. కోర్ ఐ3- 1215 యూ 12వ జనరేషన్ ప్రాసెసర్ తో పనితీరు బ్రహ్మాండంగా ఉంటుంది. అమెజాన్ లో ఈ ల్యాప్ టాప్ ధర రూ.36,490.

ప్రాథమిక స్థాయి పనులన్నింటికీ లెనోవా ఐడియా ప్యాడ్ 1 ల్యాప్ టాప్ చక్కగా పనిచేస్తుంది. దీని బరువు 1.3 కిలోలు మాత్రమే ఉండడంతో ఎక్కడికైనా సులభంగా తీసుకువెళ్లవచ్చు. ఇంటెల్ కోర్ సెలెరాన్ ఎన్ 4020 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజీ, 15 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే తదితర ప్రత్యేకతలున్నాయి. విద్యార్థులకు, నిపుణులకు బాగా ఉపయోగపడుతుంది. లెనోవా ఐడియా ప్యాడ్ 1 ల్యాప్ టాప్ అమెజాన్ లో రూ.25,490కి అందుబాటులో ఉంది.

గేమింగ్ ఇష్టపడేవారికి లెనోవా ఐడియా ప్యాడ్ గేమింగ్ ల్యాప్ టాప్ చాలా ఉపయోగంగా ఉంటుంది. దీనిలో 8 జీబీ ర్యామ్, 512 జీజీ స్టోరేజీ, విండోస్ 11, 15.6 అంగుళాల ఎఫ్ హెచ్ డీ ఐపీఎస్ డిస్ ప్లే, ఏఎండీ రైజెన్ 5 5500హెచ్ ప్రాసెసర్ ఏర్పాటు చేశారు. అంతరాయం లేని గేమింగ్ అనుభవం కోరుకునేవారికి ఇది బెస్ట్ చాయిస్. అమెజాన్ లో ఈ ల్యాప్ టాప్ రూ.47,990కి అందుబాటులో ఉంది.

లెనోవా స్మార్ట్ చాయిస్ ఎల్ఓక్యూ అనేది గేమింగ్ ల్యాప్ టాప్, 12 జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5- 12450 హెచ్ ఎక్స్ ఆధారంగా పనిచేస్తుంది. 15.6 అంగుళాల ఎఫ్ హెచ్ డీ డిస్ ప్లే, ఎన్వీఐడీఐఏ గ్రాఫిక్స్, 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజీ, 3 నెలల గేమింగ్ పాస్ తో అందుబాటులో ఉంది. అమెజాన్ లో ఈ ల్యాప్ టాప్ ను రూ.70,990కు కొనుగోలు చేసుకోవచ్చు.