
టెన్సర్ చిప్‌సెట్‌తో వచ్చే గూగుల్ పిక్సెల్ 6 ఏ ఫోన్ 6.1 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. 12 ఎంపీ కెమెరాతో పని చేసే ఈ ఫోన్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. గూగుల్ పిక్సెల్ 7 ఏ రిలీజ్ అయ్యాక ఈ ఫోన్‌పై అదిరిపోయే తగ్గింపు ధరలతో వస్తుంది. ఈ ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.27,999కు అందుబాటులో ఉంది.

అమెజాన్‌లో రూ.27,999కు అందుబాటులో ఉన్న ఐక్యూ నియో 7 5 జీ ఫోన్ మీడియాటెక్ డైమన్సిటీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 120 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేసే ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ 6.78 అంగుళాల ఎమోఎల్‌ఈడీ డిస్‌ప్లేతో పని చేసే ఈ ఫోన్‌లో 64 ఎంపీ కెమెరా ఆకర్షణీయంగా ఉంటుంది. గేమింగ్ ప్రియులను ఈ ఫోన్ విపరీతంగా ఆకర్షిస్తుంది.

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఇటీవల రిలీజ్ చేసిన రియల్ మీ 11 ప్రో ఫోన్ గేమింగ్ ప్రియులను ఆకట్టుకుంటుంది. 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అలాగే ముఖ్యంగా ఈ ఫోన్ 6.7 అంగుళాల డిస్‌ప్లేతో పని చేసే ఈ ఫోన్ గేమింగ్ ప్రియులను ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ ధర రూ.25,550గా ఉంది.

రెడ్‌మీ కే 50 ఐ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 6.6 అంగుళాల ఎమోఎల్‌ఈడీ డిస్‌ప్లేతో వచ్చే ఈ ఫోన్ ఫాస్ట్ చార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. తక్కువ ధరకే గేమింగ్ ఫోన్ కావాలనుకునే వారికి ఈ ఫోన్ సరిగ్గా సరిపోతుంది. ఈ ఫోన్ ప్రస్తుతం అమెజాన్ రూ.20,999గా ఉంది.

రెడ్‌మీ నోట్ 12 ప్రో ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ.22,379 అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేసే ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ పని చేసే ఈ ఫోన్ గేమింగ్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.