iPhone 16: లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.

|

Jun 29, 2024 | 10:27 PM

యాపిల్‌ నుంచి ఏదైనా కొత్త ప్రొడక్ట్‌ వస్తుందంటే చాలు ఎక్కడ లేని క్రేజ్‌ ఉంటుంది. ముఖ్యంగా ఐఫోన్‌ సిరీస్‌కు సంబంధించి ఉండే క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే తాజాగా ఐఫోన్16 సిరీస్‌ లాంచ్‌కు సిద్ధమవుతోంది. మరి ఐఫోన్‌16లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
ఐఫోన్‌ 16 సిరీస్‌ను 2024 సెప్టెంబర్‌లో మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధునాతన ఫీచర్లతో ఈ కొత్త సిరీస్‌ను తీసుకొచ్చేందుకు యాపిల్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయంటే.

2 / 5
ఐఫోన్‌ 16 సిరీస్‌ డిజైన్‌లో భారీ మార్పులు చేస అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 16 ప్రోలో 6.3 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను, ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌లో 6.9 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. అలాగే 120 హెచ్‌జడ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో ఈ స్క్రీన్‌ను అందించనున్నారు.

3 / 5
ఐఫోన్‌ 16, ఐఫోన్‌ 16 ప్లస్‌లో ఏ18 ఎస్‌ఓసీ చిప్‌సెట్‌ ప్రాసెసర్‌ను ఇవ్వనున్నారు. అలాగే ఐఫోన్‌ 16 ప్రో, ప్రో మ్యాక్స్‌లో ఏ18 ప్రో చిప్‌సెట్ ప్రాసెసర్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఐఫోన్‌ 16లో 561 ఎమ్‌ఏహెచ్‌తో కూడిన బ్యాటరీని ఇవ్వనున్నారి సమాచారం. ఐఫోన్‌ 16 ప్లస్‌లో 4006 ఎమ్‌ఏహెచ్‌, ప్రో మ్యాక్స్‌లో 4676 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

4 / 5
ఇక కెమెరా విషయానికొస్తే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్‌ 1 ప్రో మ్యాక్స్‌లో 5ఎక్స్‌ జూమ్‌ కెపాసిటీతో కూడిన కెమెరాను ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందులో 48 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరాను ఇవ్వనున్నారని తెలుస్తోంది.

5 / 5
ఐఫోన్‌ 16 స్మార్ట్‌ ఫోన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఐఓఎస్‌ 18 ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఏఐ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. దీంతో వాయిస్‌ అసిస్టెంట్ సిరితో పాటు మెసేజింగ్ యాప్స్‌లో ఏఐ ఫీచర్‌ ఎనేబుల్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి వీటిలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.