Best Laptops: టు ఇన్‌వన్ ల్యాప్‌టాప్స్‌పై ది బెస్ట్ ఆఫర్లు.. ఆ ల్యాప్‌టాప్స్‌లో టాప్ అవే..!

|

Sep 13, 2024 | 5:00 PM

భారతదేశంలో లాక్ డౌన్ తర్వాత ల్యాప్ టాప్ వాడకం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ప్రతి ఇంట్లో పిల్లల చదువుతో పాటు తల్లిదండ్రుల అవసరాలకు ల్యాప్‌టాప్ కనీస అవసరంగా మారాయి. ఇటీవల కాలంలో చాలా మంది టు ఇన్ వన్ ల్యాప్‌టాప్స్‌ను ఇష్టపడుతున్నారు. తాజాగా ఈ ల్యాప్‌టాప్‌లపై ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు. దాదాపు ఆయా ల్యాప్‌టాప్స్‌పై 69 శాతం తగ్గింపులను అందిస్తుంది. అలాగే వివిధ బ్యాంకు కార్డులపై 10 శాతం ఇన్‌స్టంట్ తగ్గింపును అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెజాన్‌లో ఏయే ల్యాప్‌టాప్స్‌పై ఆఫర్లను అందిస్తున్నారో..? తెలుసుకుందాం.

1 / 5
హెచ్‌పీ ల్యాప్‌టాప్ 2 ఇన్ 1 పెవిలియన్ ల్యాప్‌టాప్‌పై అమెజాన్‌లో 24 శాతం తగ్గింపు అందిస్తున్నారు. ఐ5 ప్రాసెసర్‌తో వచ్చే ఈ ల్యాప్‌టాప్ 16 జీబీ + 512 జీబీ వేరియంట్‌ అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్‌పై రూ. 20,000 కంటే ఎక్కువ ఆదా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ల్యాప్‌టాప్‌ను టాబ్లెట్ లాగా కూడా ఉపయోగించవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌ స్కెచింగ్‌కు కూడా ఉపయోగపడుతుంది. ఈ హెచ్‌పీ ల్యాప్‌టాప్ ధర రూ. 69,990గా ఉంది.

2 / 5
లెనోవో ల్యాప్‌టాప్ టు ఇన్ వన్ ఐడియల్ ప్యాడ్ ఫ్లెక్స్5 ల్యాప్‌టాప్ కూడా 32 శాతం తగ్గింపుతో వస్తుంది. మల్టీ టాస్కింగ్‌కు అనువుగా ఉండే ఈ ల్యాప్‌టాప్ ఐ5 ప్రాసెసర్ ద్వారా పని చేసింది. ఈ ల్యాప్‌టాప్‌పై రూ.1,750 తక్షణ క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ లెనోవో ల్యాప్‌టాప్ ధర: రూ. 62,991గా ఉంది.

3 / 5
ఏసర్ ఏస్పైర్ 3 స్పిన్ 14 ల్యాప్‌టాప్ 25 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లోని మల్టీ టచ్ సదుపాయం అందరినీ ఆకర్షిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ ఫ్లిప్ టాబ్లెట్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్‌తో సులభంగా మల్టీ-టాస్కింగ్‌కు అనువుగా ఉంటుంది. 14 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వచ్చే ఏసర్ ల్యాప్‌టాప్ ధర రూ. 41,990.

4 / 5
డెల్ ల్యాప్‌టాప్ ఇన్‌స్పిరాన్ 7430 టచ్ స్క్రీన్ ల్యాప్‌టాప్‌పై అమెజాన్‌లో 32 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్ 13వ జెనరేషన్ ఐ3 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ ద్వారా ఒకే స్క్రీన్‌పై మల్టీ-టాస్క్ వర్క్ చేసే సదుపాయాన్ని పొందవచ్చు. 14 అంగుళాల ఫుల్ హెచ్‌డీ స్క్రీన్‌తో పాటు ఫింగర్‌ప్రింట్ రీడర్ సౌకర్యం ఉంటుంది. ఈ డెల్ ల్యాప్‌టాప్ ధర రూ. 48,990గా ఉంటుంది.

5 / 5
చువి ల్యాప్‌టాప్ 2 ఇన్ 1 ఫ్రీబుక్ 13.5 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో ఆకట్టుకుంటుంది. ఈ ల్యాప్‌టాప్‌పై అమెజాన్‌లో 24 శాతం తగ్గింపు అందుబాటులో ఉంటుంది. 12వ జెనరేషన్‌తో ఐ3 ప్రాసెసర్‌తో వస్తుంది. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వచ్చే ఈ చువి ల్యాప్‌టాప్ ధర రూ. 37,990గా ఉంది.