
నగదు లావాదేవీలతో పోలిస్తే గత కొన్ని సంవత్సరాలుగా ఆన్‌లైన్ లావాదేవీల ధోరణి వేగంగా పెరిగింది. ఇప్పుడు రోజువారీ పనుల కోసం చాలా మంది Paytm, Google pay, Phonepe వంటి యాప్ లను ఉపయోగిస్తున్నారు. ఇలా మనీ ట్రాన్సాక్షన్ల కోసం యాప్‌ల వాడకం విపరీతంగా పెరిగింది. అయితే, దీన్నే క్యాష్ చేసుకోవాలని చూస్తున్న సైబర్ నేరగాళ్లు.. తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు.

ఇంటర్నెట్‌లో మనీ ట్రాన్స్‌ఫర్ యాప్స్ చాలా ఉన్నాయి. వాటిలో నిజమైనవి కొన్ని అయితే, ఫేక్ యాప్స్ చాలా ఉన్నాయి. ఇవి అత్యంత ప్రమాదకరం. పొరపాటున గనుక ఇన్‌స్టాల్ చేసుకుని వివరాలను నమోదు చేసుకున్నట్లయితే.. క్షణాల్లోనే మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేసేస్తారు. అందుకే ఫేక్ మనీ ట్రాన్స్‌ఫర్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండటం చాలా మంచింది.

టూల్‌టిప్ నేటీవ్ లైబ్రరీ నివేదిక ప్రకారం.. పసిఫిక్ విపిఎన్, క్యూఆర్/ బార్‌కోడ్ స్కానర్ మ్యాక్స్, ఈ-విపిఎన్, బీట్‌ప్లేయర్, మ్యూజిక్ ప్లేయర్ యాప్స్.. యూజర్ యొక్క బ్యాంక్ వివరాలను దొంగిలించినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి యాప్స్ మీ ఫోన్లలో ఉంటే వెంటనే అన్ ఇన్‌స్టాల్ చేయడం చాలా మంచింది.

ఈ ఆండ్రాయిడ్ యాప్స్.. యూజర్ ఫోన్‌లో ఏలియన్ బాట్ బ్యాంకర్, ఎఆర్ఏటిని మాల్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసే హానీకరమైన ప్రోగ్రామ్స్‌ని కలిగి ఉన్నాయి. ఇవి యూజర్ల యొక్క బ్యాంక్ డిటెయిల్స్‌ను దొంగిలిస్తాయి.

మీరు ఇలాంటి ప్రమాదకరమైన యాప్స్ బారిన పడకూడదు అనుకుంటు.. మీ స్మార్ట్ ఫోన్లలో అధికారిక యాప్స్‌ను మాత్రమే వాడండి. అలాగే వాటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండండి.