గ్యాబ్ వాచ్ 3 కూడా పిల్లలు అమితంగా ఇష్టపడతారు. బ్లూటూత్, జీపీఎస్, 3జీ వాయిస్ కాలింగ్ ఫీచర్లతో మీ పిల్లలకు మంచి ట్రాకర్‌గా ఈ వాచ్ ఉపయోగపడుతుంది. 1.41 అంగుళాల టచ్ డిస్‌ప్లేతో పాటు వాటర్ రెసిస్టెంట్, ఐపీ 68 రెసిస్టెంట్ ఫీచర్లు ఈ వాచ్‌ను అందరూ ఇష్టపడేలా చేస్తుంది. పెడోమీటర్, స్టెప్ కౌంట్ అలారం, స్టాప్‌వాచ్, రిమైండర్, టైమర్ వంటి ఫీచర్లు ఈ వాచ్‌లు అదనపు ప్రత్యేకతలుగా ఉన్నాయి.