Sony Xperia Pro1: సోనీ నుంచి కొత్త స్మార్ట్‌ ఫోన్‌.. ధర అక్షరాల రూ. లక్షన్నర.. అంత ప్రత్యేకత ఏంటనేగా.?

| Edited By: Ravi Kiran

Oct 29, 2021 | 6:25 AM

Sony Xperia Pro1: ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ సంస్థ తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. సోనీ ఎక్స్‌పీరియా ప్రో 1 పేరుతో వచ్చిన ఈ స్మార్ట్‌ ఫోన్‌లోని ఫీచర్లు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి...

1 / 6
ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సోనీ కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేసింది. సోనీ ఎక్స్‌పీరియా ప్రో1 పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్‌ డిసెంటర్‌ నుంచి అందుబాటులోకి రానుంది.

2 / 6
సినిమాటోగ్రఫీ మోడ్‌లో వీడియోలను చిత్రీకరించడం ఈ ఫోన్‌ ప్రత్యేకత. ఇక ఈ ఫోన్‌లో జీస్ టెస్సార్ కాలిబ్రేటెడ్ ఆప్టిక్స్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు అదనంగా వ్లాగ్‌ మానిటర్‌ను కూడా లాంచ్‌ చేసింది.

3 / 6
12 జీబీ ర్యామ్‌తో రానున్న ఈ ఫోన్‌కు 30 వాట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ అందించారు. దీంతో ఈ ఫోన్‌ కేవలం గంటలోనే 100 శాతం బ్యాటర్‌ ఛార్జింగ్‌ అవుతుంది.

4 / 6
 ఈ ఫోన్‌ ధర రూ. 1.35 లక్షలుగా ఉండనున్నట్లు సమాచారం, ఇక వ్లాగ్‌ మానిటర్‌ను సెపరేట్‌గా రూ. 15 వేలకు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తే ఈ ఫోన్‌లో 6.50 అంగుళాల 4కే హెచ్‌డీఆర్‌ ఒఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు.

5 / 6
క్వాలకమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌తో నడిచే ఈ ఫోన్‌లో 512 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ అందించారు. డాల్బీ ఆట్మోస్‌ సిస్టమ్‌ ఈ ఫోన్‌ మరో ప్రత్యేకత.

6 / 6
ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో మూడు రియర్‌ కెమెరాలను అందించారు. ఒక్కో కెమెరా 12 మెగాపిక్సెల్స్‌తో ఉన్నాయి. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన సెల్ఫీ కెమెరాను అందించారు.