Narender Vaitla |
Jun 10, 2021 | 6:47 PM
ఒకప్పుడు వాచ్ అంటే కేవలం సమయం చూడడానికి మాత్రమే ఉపయోగించే వస్తువు. కానీ ఇప్పుడు స్మార్ట్ వాచ్‌ల రాకతో అన్ని పనులకు స్మార్ట్ వాచ్‌ను ఉయోగిస్తున్నారు.
స్మార్ట్ వాచ్‌లకు ఆధరణ పెరుగుతున్న నేపథ్యంలో బడా కంపెనీలు సైతం ఈ రంగంలోకి అడుగుపెడుతున్నాయి. ఇప్పటికే గూగుల్, యాపిల్, హువావే వంటి బడా టెక్ సంస్థలు స్మార్ట్ వాచీలను తయారు చేస్తున్నాయి.
దీంతో ఈ కంపెనీలకు గట్టి పోటినిచ్చే పనిలో పడ్డారు ఫేస్‌బుక్ సీఈఓ జుకర్ బర్గ్.. ఇందులో భాగంగానే ఫేస్‌బుక్ వచ్చే ఏడాది స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసే పనిలో పడింది.
ఇంకా పేరు ఖరారు చేయని ఈ స్మార్ట్ వాచ్ ధర మన కరెన్సీలో రూ. 29,000 ఉంటుందని అంచనా. కెమెరా సహాయంతో వీడియో కాల్ కూడా చేసుకోవడం ఈ స్మార్ట్ వాచ్ ప్రత్యేకత.
ప్రస్తుతం స్మార్ట్ వాచ్‌లలో అందుబాటులోఉన్న ఫిట్నెస్, హెల్త్ సంబంధించిన ఫీచర్లన్నింటినీ ఇందులో తీసుకురానున్నారు.
ఇక ఫోన్‌కు స్మార్ట్ వాచ్ అటాచ్ చేసే పనిలేకుండా ఎల్‌టిఇ కనెక్టివిటీని జోడించాలని ఫేస్‌బుక్ యోచిస్తోంది. ఇందు కోసం యుఎస్ వైర్‌లెస్ క్యారియర్‌లతో కలిసి పనిచేస్తోంది. సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన ఫేస్‌బుక్ స్మార్ట్ వాచ్ రంగంలో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.