- Telugu News Photo Gallery Technology photos Samsung soon releasing Samsung galaxy s21 fe smart phone have a look on features and price details
Galaxy s21 fe: సామ్‌సంగ్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది.. వావ్ అనిపించేలా కొత్త ఫోన్ ఫీచర్లు..
Samsung galaxy s21 fe: సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం సామ్‌సంగ్ తాజాగా కొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయనుంది. గెలాక్సీ 21 ఎఫ్ఈ పేరుతో త్వరలోనే మార్కెట్లోకి రానున్న ఈ ఫోన్ ఫీచర్లు ఎలా ఉండనున్నాయో ఓసారి చూసేయండి..
Narender Vaitla | Edited By: Ravi Kiran
Updated on: Dec 19, 2021 | 8:16 AM

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ తాజాగా మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. కంజ్యూమర్ ఎలక్ట్రానిక్ షో (సీఈఎస్) 2022లో సామ్‌సంగ్ గెలాక్సీ 21 ఎఫ్ఈ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకురానుంది.

లీక్ అయిన వివరాల ప్రకారం ఈ ఫోన్‌లో ఫీచర్లు ఇలా ఉండనున్నాయి.. ఇందులో 6.4 ఇంచెస్ ఫ్లాట్ డైనమిక్ అమోలెడ్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లే ఉండనుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఈ ఫోన్‌కు ఉన్న ప్రత్యేకత.

ఈ ఫోన్‌లో ఎఫ్ఈ స్నాప్‌డ్రాగన్ 888 లేదా ఎజ్సినోస్ 2100 ఎస్ఓసీ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ ఉండనున్నట్లు తెలుస్తోంది. 8జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇవ్వనున్నారు.

ఇక ఇందులో 12, 8, 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన ట్రిపుల్ రెయిర్ కెమెరాను అదే విధంగా సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నట్లు సమాచారం.

ధర విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6జీబీ ర్యామ్+1228జీబీ స్టోరేజీ రూ. 64,500, 8జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజీ ధర రూ.70,500గా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.





























