- Telugu News Photo Gallery Technology photos Samsung offering discount offer on Galaxy A05s, Check here for full details
Galaxy A05s: సామ్‌సంగ్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. రూ. 11 వేలకే..
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని కొత్త ఫోన్‌లను లాంచ్ చేస్తోంది. ఓవైపు ప్రీమియం స్మార్ట్ ఫోన్స్‌ను తీసుకొస్తూనే మరోవైపు బడ్జెట్ ఫోన్‌లను సైతం లాంచ్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల తీసుకొచ్చి గ్యాలక్సీ ఏ05ఎస్ స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇంతకీ ఈ ఫోన్ డిస్కౌంట్ పోను ఎంతకు లభిస్తుంది.? ఫీచర్లు ఎలా ఉండనున్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jan 13, 2024 | 6:40 PM

సౌత్ కొరియాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం సామ్‌సంగ్ ఇటీవల గ్యాలక్సీ ఏ05ఎస్ పేరుతో ఓ స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కంపెనీ ఈ ఫోన్‌పై అదనంగా డిస్కౌంట్‌ను ప్రకటించింది.

ఈ స్మార్ట్ ఫోన్‌పై సామ్‌సంగ్ రూ. 2000 డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ ఫోన్‌ను 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్స్‌లో తీసుకొచ్చారు.

ఇక డిస్కౌంట్ తర్వాత ఈ ఫోన్ బేస్ వేరియంట్‌ను రూ. 11,499కి సొంతం చేసుకోవచ్చు. అలాగే 6జీ వేరియంట్ విషయానికొస్తే.. ఈ ఫోన్‌ను రూ. 12,999కి పొందొచ్చు. సామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఈ కామర్స్ సైట్స్‌లో ఆ ఆఫర్ లభిస్తోంది.

ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 689 ప్రాసెసర్‌ను అందించారు. లైట్ వయలెట్, బ్లాక్ కలర్స్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఇక ఇందులో 6. 71 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందించారు.

కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ కలిగినఈ ఫోన్ 25వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.




