Samsung: సామ్‌సంగ్‌ నుంచి కొత్త ల్యాప్‌టాప్‌.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో..

|

Mar 24, 2024 | 8:09 PM

సౌత్‌ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ మార్కెట్లోకి కొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్‌ చేసింది. సామంగ్‌ గ్యాలక్సీ బుక్‌4 పేరుతో ఈ కొత్త ల్యాప్‌టాప్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి అధునాతన ఫీచర్లనుఈ ల్యాప్‌టాప్‌లో అందించారు. ఇంతకీ ఈ ల్యాప్‌టాప్‌లో ఎలాంటి ఫీచర్ల ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
 ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ భారత మార్కెట్లోకి కొత్త ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. గ్యాలక్సీ బుక్‌ 4 పేరుతో ఈ ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ టూల్స్‌తో ఈ ల్యాప్‌టాప్‌ను లాంచ్‌ చేశారు.

2 / 5
ఈ ల్యాప్‌టాప్‌లో ఇంటెల్‌ కోర్‌ 5 ప్రాసెసర్‌ను అందించారు. ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ధర రూ. 70,990కాగా 16 జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ధరను రూ. 75,990గా నిర్ణయించారు. ఇక ఇంటెల్‌ కోర్‌7 వేరియంట్‌ 16 జీబీ ధర రూ. 85,990గా ఉంది.

3 / 5
గ్యాలక్సీ బుక్‌ 4 ల్యాప్‌టాప్‌ను గ్రే, సిల్వర్‌ కలర్స్‌లో తీసుకొచ్చారు. సామ్‌సంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, ప్రముఖ ఆన్‌లైన్‌ స్టోర్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ల్యాప్‌టాప్‌పై విద్యార్థులకు 10 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.

4 / 5
ఫీచర్ల విషయానికొస్తే ఈ ల్యాప్‌టాప్‌లో 15.6 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ ఎల్‌ఈడీ యాంటీ గ్లేర్‌ స్క్రీన్‌ను అందించారు. ఈ ల్యాప్‌టాప్‌లో విండోస్‌ 11 హోమ్‌తో ముందే ఇన్‌స్టాల్ చేశారు. ఫొటో ఎడిటింగ్ కోసం ఏఐ సపోర్ట్‌ చేసే ఫొటో రీమాస్టర్‌, వీడియో ఎడిటర్‌ ఫీచర్లను అందించారు.

5 / 5
ఇక ఈ ల్యాప్‌టాప్‌ను మెమొరీని 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. టైప్-సి పోర్ట్ ద్వారా 45W చార్జింగ్‌ సపోర్ట్‌తో 54Wh బ్యాటరీని కూడా ఇచ్చారు. ల్యాప్‌టాప్‌ బరువు 1.55 కిలోలుగా ఉంది. ఇక సామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్‌లోని కెమెరాను వెబ్‌క్యామ్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు.