Samsung Galaxy A13 5G: సామ్‌సంగ్‌ నుంచి చవకైన 5జీ స్మార్ట్‌ఫోన్‌.. గెలాక్సీ ఏ13 ఫోన్‌ ఫీచర్లపై ఓ లుక్కేయండి..

|

Dec 02, 2021 | 9:26 AM

Samsung Galaxy A13 5G: ప్రపంచ దేశాలన్నీ 5జీ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో కంపెనీలన్నీ 5జీ సపోర్ట్‌ ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సామ్‌సంగ్‌ తక్కువ ధరలో 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లపై ఓ లుక్కేయండి..

1 / 5
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ తాజాగా మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది. గెలాక్సీ ఏ13 5జీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ ప్రస్తుతం అమెరికాలో విడుదలైంది. త్వరలోనే భారత్‌లో లాంచ్‌ కానున్న ఈ ఫోన్‌ ఫీచర్లు ఇలా ఉన్నాయి..

2 / 5
6.5 ఇంచెస్‌ 90 హెచ్‌జెడ్‌ ఇన్ఫినిటీ వీ డిస్‌ప్లేను ఈ స్మార్ట్‌ ఫోన్‌లో అందించారు. ఇక ఈ ఫోన్‌లో మీడియాటెక్‌ డైమెన్సిటీ 700 చిప్‌సెట్‌తో రూపొందించారు.

3 / 5
కెమెరాకు అధిక ప్రాముఖ్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 5 మెగా పిక్సెల్స్‌ సెల్ఫీ కెమెరాను ఇచ్చారు.

4 / 5
ఇక 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో 15 వాట్ ఛార్జింగ్‌ సపోర్ట్ చేసే 5000ఏంహెచ్‌ బ్యాటరీని అందించారు.

5 / 5
5జీ సపోర్ట్‌తో రూపొందించిన ఈ ఫోన్‌ అమెరికాలో 250 డాలర్లకు అందుబాటులో ఉంది. మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 18వేలుగా ఉంది.