Samsung: సామ్‌సంగ్ నుంచి బడ్జెట్‌ ఫోన్‌.. తక్కువ ధరలో సూపర్‌ ఫీచర్స్‌

|

Jul 18, 2024 | 9:10 PM

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌లు మార్కెట్లో సందడి చేస్తున్న క్రమంలో ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వన్‌ప్లస్‌, రెడ్‌మీ వంటి ఫోన్‌లకు పోటీనిస్తూ మిడ్‌ రేంజ్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎమ్‌35 పేరుతో తీసుకొచ్చిన ఈ 5జీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
సౌత్ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఎం సిరీస్‌లో భాగంగా గ్యాలక్సీ ఎమ్‌35 ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ ఫోన్‌ను మిడ్ రేంజ్‌ బడ్జెట్‌ను టార్గెట్‌ చేసుకొని తీసుకొచ్చారు. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయంటే.

2 / 5
సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌35 5జీ ఫోన్‌లో 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు.ఇక ఈ ఫోన్‌లో 6.6 ఇంచస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ సూపర్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్‌ రేట్‌ 100 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్‌ సొంతం.

3 / 5
ఇక  ఈ ఫోన్ ఆక్టాకోర్‌ ఎగ్జినోస్‌ 130 ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఈ స్క్రీన్‌కు కార్నింగ్ గొరిల్లా విక్టస్‌+ ప్రొటెక్షన్‌ను అందించారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో వైఫై 6, బ్లూటూత్‌ 5.3, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌ వంటి ఫీచర్లను అందించారు.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌,8 మెగాపిక్సెల్స్‌ అల్ట్రావైడ్‌ యాంగిల్‌, 2 ఎంపీ మ్యాక్రో సెన్సర్‌తో కూడిన ట్రిపుల్‌ రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 13 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు.

5 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌ను మూడు స్టోరేజీ వేరియంట్లలో తీసుకొచ్చారు. ధర విషయానికొస్తే 6జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.19,999.. 8జీబీ+ 128జీబీ వేరియంట్‌ ధర రూ.21,499, 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.24,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ అమ్మకాలు జులై 20వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా అన్ని ఆఫర్స్‌ కలుపుకొని రూ. 3 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు.