Galaxy Book 4: సామ్‌సంగ్‌ నుంచి కొత్త ల్యాప్‌టాప్‌.. ధరతో పాటు ఫీచర్స్‌ కూడా అదుర్స్‌..

|

Feb 25, 2024 | 10:13 PM

సౌత్‌ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ భారత మార్కెట్లోకి కొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్‌ చేసింది. సామ్‌స్ంగ్‌ గ్యాలక్సీ బుక్‌ 4 సిరీస్‌ పేరుతో ఈ ల్యాప్‌టాప్‌ను లాంచ్‌ చేశారు. ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. ప్రీమియం రేంజ్‌లో తీసుకొచ్చిన ఈ ల్యాప్‌టాప్‌లో అదిరిపోయే ఫీచర్లను అందించారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ భారత మార్కెట్లోకి గ్యాలక్సీ బుక్‌ 4 సిరీస్‌ పేరుతో ల్యాప్‌టాప్‌ను లాంచ్‌ చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా గ్యాలక్సీ బుక్‌ 4 ప్రో 360, గ్యాలక్సీ బుక్‌ 4 360 పేర్లతో ఈ రెండు ల్యాప్‌టాప్‌లను తీసుకొచ్చారు.

2 / 5
ఫిబ్రవరి 20వ తేదీ నుంచి అడ్వాన్స్‌ బుకింగ్‌ ప్రారంభమయ్యాయి. సామ్‌సంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, ఎంపిక చేసిన కొన్ని ఈ కామర్స్‌ సైట్స్‌లో ఈ ల్యాప్‌టాప్స్‌ను బుకింగ్‌ చేసుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్‌ను అందించారు.

3 / 5
ఇక ఫీచర్ల విషయానికొస్తే ఈ ల్యాప్‌టాప్స్‌లో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ (CPU), గ్రాఫిక్స్‌ ప్రాసెస్‌ యూనిట్‌, న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ వంటి ఫీచర్లను అందించారు. గ్యాలక్సీ బుక్‌4 360 ల్యాప్‌టాప్‌లో 15.6 ఇంచెస్‌ ఫుల్‌హెచ్‌డీ సూపర్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు.

4 / 5
ఈ ల్యాప్‌టాప్‌ ధరను రూ.1,14,990గా నిర్ణయించారు. ఇక గ్యాలక్సీ బుక్‌4 ప్రో మోడల్‌ను 14, 16 ఇంచెస్ వేరియంట్‌లో తీసుకొచ్చారు. వీటి ధరలు రూ. 1.32 లక్షల లోపు ఉండనున్నాయి. బుక్‌4 ప్రో 360 మోడల్‌లో 16 ఇంచెస్‌ డైనమిక్ అమోఎల్‌ఈడీ 2ఎక్స్‌ టచ్‌ స్క్రీన్‌ను అందించారు. దీని ప్రారంభ ధర రూ.1,63,990గా ఉంది.

5 / 5
ఇక అడ్వాన్స్‌ బుకింగ్ చేసుకున్న వారికి సామ్‌సంగ్‌ రూ.5,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. రూ.10,000 విలువైన బ్యాంక్ క్యాష్‌బ్యాక్ లేదా రూ. 8,000 వరకు అప్‌గ్రేడ్ బోనస్, 24 నెలల వరకు నో-కాస్ట్ EMI ఎంపిక వంటి ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.