రెడ్‌మీ 12 5జీ స్మార్ట్‌ఫోన్‌ను 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్256జీబీ స్టోరేజ్ వేరియంట్స్‌లో తీసుకురానున్నారు. బేస్ వేరియంట్ ధర రూ. 9,999 కాగా హైఎండ్ మోడల్ రూ.13,999గా ఉండనున్నట్లు సమాచారం.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.79 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 1080 X 2400 పిక్సెల్ రిజల్యూషన్ ఈ స్క్రీన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ మీడియా టెక్ హీలియో జీ88 12ఎన్‌ఎమ్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ స్మార్ట్ ఫోన్ పనిచేస్తుంది.
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు.
ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నారు. అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.