Smart TV: వారెవ్వా ఏమన్న టీవీనా.. రూ. 12 వేలకే 32 ఇంచెస్‌ స్క్రీన్‌. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే.

|

Mar 27, 2023 | 7:44 PM

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజ సంస్థ రెడ్‌మీ తాజాగా కొత్త స్మార్ట్‌ టీవీని లాంచ్‌ చేసింది. అమెజాన్‌తో కలిసి రెడ్‌మీ తన ఫైర్‌ టీవీని తీసుకొచ్చింది. ఫైర్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ స్మార్ట్‌ టీవీని తక్కువ బడ్జెట్‌లో తీసుకొచ్చారు. కేవలం రూ. 12 వేలలోనే 32 ఇంచెస్‌ స్క్రీన్‌ ఈ టీవీ సొంతం..

1 / 5
 ప్రస్తుతం మార్కెట్లో రోజుకో కొత్త స్మార్ట్‌ టీవీ హల్చల్‌ చేస్తోంది. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో కూడిన టీవీలను కంపెనీలు లాంచ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌తో కలసి రెడ్‌మీ తన ఫైర్ టీవీని లాంచ్ చేసింది. ఇది ఫైర్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది.

2 / 5
టీవీ ధర విషయానికొస్తే.. 32 అంగుళాల కేవలం రూ. 12,000కే అందుబాటులో ఉంది. అంతేకాక అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభిస్తుంది. ఇక ఈ స్మార్ట్‌ టీవీలో వివిడ్ పిక్చర్ ఇంజిన్, డాల్బీ ఆడియో వంటి ఫీచర్లను అందించారు.

3 / 5
ఈ టీవీ అసలు ధర రూ. 13,999కాగా ప్రారంభ ఆఫర్ కింద అన్ని రకాల డిస్కౌంట్స్‌లను కలుపుకొని రూ. 11,999కే ఈ స్మార్ట్ టీవీ అందుబాటులో ఉంటుంది.

4 / 5
ఈ ఫైర్‌ టీవీలో 20 వాట్స్ పవర్ ఫుల్ స్పీకర్స్ ఉన్నాయి. 1 జీబీ ర్యామ్- 8 జీబీ స్టోరేజ్ కూడా లభిస్తోంది. ఇన్ బిల్ట్ అలెక్సా బటన్ కూడా ఉంటుంది. ఎయిర్ ప్లే, మిరాకాస్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.

5 / 5
 ఇందులోని ఫైర్ ఓఎస్ 7ను బట్టి ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్, జీ5, సోనీలివ్, యూట్యూబ్ వంటి వాటితో పాటు మరిన్నింటితో సహా ఫైర్ టీవీ యాప్ స్టోర్ నుంచి 12,000కు పైగా యాప్‌లను వినియోగించుకోవచ్చు.