
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ భారత మార్కెట్లోకి ఇటీవల రియల్‌మీ జీటీ 6టీ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్స్ ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. అమెజాన్‌తో పాటు రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

ఇదిలా ఉంటే ఈ ఫోన్‌కు కొనసాగింపుగా కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నారు. రియల్‌మీ జీటీ7 ప్రో పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. కంపెనీ ఇప్పటి వరకు ఈ ఫోన్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

అయితే నెట్టింట ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్లు వైరల్ అవుతున్నాయి. వీటి ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్‌లో క్వాల్ కామ్ నెక్ట్స్ జనరేషన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 4 ఎస్వోసీ చిప్ సెట్‌ను అందించనున్నారని తెలుస్తోంది.

ఇక రియల్‌మీ జీటీ6టీ స్మార్ట్ ఫోన్‌లో 6000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నారని తెలుస్తోంది. రియల్‌మీజీ జీటీ 6టీ స్మార్ట్ ఫోన్ ధరను రూ. 30,999గా నిర్ణయించగా. కొత్తగా వస్తున్న రియల్‌మీ జీటీ 7 ప్రో స్మార్ట్ ఫోన్ ధర రూ. 35 వేలలోపు ఉండొచ్చని అంచన వేస్తున్నారు.

Smartఇదిలా ఉంటే రియల్‌మీ జీటీ 6టీ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 2780×1264 పిక్సెల్స్ రిజల్యూషన్ ఈ స్క్రీన్ సొంతం. 6000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌తో పాటు, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌ను అందించారు.