
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. రియల్‌మీ నోట్60 పేరుతో ఈ ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్ చేయనున్నారు. గతేడాది తీసుకొచ్చిన రియల్‌మీనోట్50కి కొనసాగింపుగా రియల్‌మీ నోట్60 ఫోన్‌ను తీసుకొస్తున్నారు.

ఆగస్టు 30వ తేదీన ఈ ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్ చేయనున్నారు. రియల్‌మీ నోట్ 60 ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.74 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ టెక్నాలజీని అందించారు.

ఈ స్మార్ట్ ఫోన్‌లో క్యాప్సూల్ 2.0 ఫీచర్‌ను ప్రత్యేకంగా అందించారు. అలాగే బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 5000 ఎంఏహెచ్ వంటి పవర్‌ఫుల్ వంటి బ్యాటరీని ఇవ్వనున్నారు. ఈ ఫోన్ ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో పని చేస్తుంది.

కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. ఈ ఫోన్‌ను 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ, 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వంటి మొత్తం మూడు వేరియంట్స్‌లో తీసుకొస్తున్నారు.

ధరకు సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ ఫోన్‌లో ఐపీ64 రేటెడ్ కూడిన డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్‌ను అందించనున్నారు. ఈ ఫోన్ 7.84 ఎమ్ ఎమ్ వెడల్పు, 187 గ్రాముల బరువు ఉంటుంది.