Realme Smart TV: భార‌త్‌లో కొత్త స్మార్ట్ టీవీని లాంచ్ చేసిన రియ‌ల్‌మీ.. ప్రారంభ ఆఫ‌ర్ కింద రూ. 17,999 కే..

|

Jun 25, 2021 | 3:45 PM

Realme Smart TV: భార‌త మార్కెట్లో స‌త్తా చాటుతోన్న రియ‌ల్ మీ తాజాగా కొత్త‌గా మ‌రో స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. అధునాత‌న ఫీచ‌ర్ల‌తో కూడిన ఈ 32 ఇంచెస్ స్మార్ట్ టీవీని ఈ నెల 29 నుంచి అందుబాటులోకి రానుంది..

1 / 6
 స్మార్ట్ ఫోన్ రంగంలో పెను సంచ‌ల‌నంగా దూసుకొచ్చిన రియ‌ల్‌మీ.. తాజాగా స్మార్ట్ టీవీల త‌యారీలోనూ త‌న హ‌వాను చాటుతోంది. స‌రికొత్త ఫీచ‌ర్ల‌తో కూడిన టీవ‌ల‌ను లాంచ్ చేస్తోంది.

2 / 6
ఈ క్ర‌మంలోనే తాజాగా భార‌త్‌లో కొత్త స్మార్ట్ టీవీని లాంచ్ చేసిందీ కంపెనీ. 32 ఇంచెస్ స్క్రీన్‌తో రూపొందించిన ఈ స్మార్ట్ టీవీ రిజ‌ల్యూష‌న్ 1,920x1,080 పిక్సెల్స్‌గా ఉంది.

3 / 6
24W సౌండ్ అవుట్‌పుట్‌, డాల్బీ ఆడియో సపోర్ట్ ఈ స్మార్ట్ టీవీ సొంతం. అంతేకాకుండా హెచ్‌డీఆర్ ఫార్మాట్‌ను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది.

4 / 6
ఇన్ని ఫీచ‌ర్ల‌తో కూడిన ఈ స్మార్ట్ టీవీని రియ‌ల్‌మీ కేవ‌లం రూ. 18,999కే తీసుకొచ్చింది. ఇక ప్రారంభ ఆఫ‌ర్ కింద రూ. వెయ్యి త‌క్కువ‌గా రూ. 17,999కే అందుబాటులోకి రానుంది. జూన్ 29 నుంది సేల్ అందుబాటులోకి రానుంది.

5 / 6
రియ‌ల్‌మీ స్మార్ట్ టీవీ ఫుల్ హెచ్‌డీ పేరుతో లాంచ్ చేసిన ఈ టీవీ ఆండ్రాయిడ్ 9 ఆప‌రేటింగ్ సిస్టంపై ప‌నిచేస్తుంది.

6 / 6
 ఈ స్మార్ట్ టీవీలో గూగుల్ అసిస్టెంట్, క్రోమ్‌కాస్ట్ సపోర్ట్ వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి. అంతేకాకుండా.. గూగుల్ ప్లేస్టోర్‌కు యాక్సెస్, ప్రముఖ స్ట్రీమింగ్ యాప్స్‌ను ఇన్‌బిల్ట్‌గా ఇందులో అందించారు.