చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమికి చెందిన పోకో తాజాగా భారత మార్కెట్లోకి సరికొత్త బడ్జెట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. పోకో సీ3 పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్ ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి.
రూ. 9,499కి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్‌లో అత్యంత తక్కువ సమయంలో ఏకంగా 30 లక్షలకుపైగా అమ్ముడు పోయినట్లు కంపెనీ తెలిపింది.
ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.53 అంగుళాల HD+ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్ 4 జీబీర్యామ్+64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది.
ఈ స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ హెలియో జీ35 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను అందించారు. అలాగే 10 w ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.
కెమెరా విషయానికొస్తే ఇందులో 10 మెగా పిక్సెల్స్ రెయిర్ కెమెరాతో పాటు 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.