OPPO Find N2 Flip: బాప్‌రే ఏం ఫోన్‌ గురూ.! పేపర్‌ను మడతపెట్టినట్లు పెట్టేయొచ్చు. స్టన్నింగ్ ఫీచర్స్‌..

|

Feb 23, 2023 | 1:46 PM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజ సంస్థ ఒప్పో భారత మార్కెట్లోకి ఫోల్డబుల్‌ ఫోన్‌ను తీసుకొస్తోంది. ఒప్పో ఫైండ్‌ ఎన్‌2 ఫ్లిప్‌ పేరుతో లాంచ్‌ చేయనున్న ఈ స్మార్ట్‌ ఫోన్‌ను స్టన్నింగ్‌ లుక్‌లో డిజైన్‌ చేశారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఉన్న ఫీచర్లపై ఓ లుక్కేయండి..

1 / 5
ప్రస్తుతం మార్కెట్లో ఫోల్డబుల్‌ ఫోన్‌లకు డిమాండ్‌ పెరగుతోంది. కంపెనీలు సైతం ఇలాంటి ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తున్నాయి. సామ్‌సంగ్‌ మొదలు దాదాపు అన్ని బడా కంపెనీలు మడతపెట్టే ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఒప్పో సైతం తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ను తీసుకొస్తోంది.

2 / 5
ఒప్పో ఫైండ్‌ ఎన్‌2 ఫ్లిప్‌ పేరుతో తీసుకొస్తున్న ఈ స్మార్ట్‌ ఫోన్‌ను త్వరలోనే భారత్‌లో లాంచ్‌ చేయనున్నారు. ఈ ఫోన్‌లో ఇప్పటి వరకు లేని విధంగా 3.26 ఇంచెస్‌ కవర్‌ డిస్‌ప్లేను అందించారు. ఫ్లిప్‌ ఫోన్‌లో ఇంత పెద్ద డిస్‌ప్లేను తీసుకురావడం ఇదే తొలిసారి. 191 గ్రాముల బరువుండే ఈ ఫోన్‌ ఫ్లిప్‌ ఓపెన్‌ చేసినప్పుడు 7.45 ఎమ్‌ఎమ్‌ మందంతో ఉంటుంది.

3 / 5
ఈ ఫోన్‌ కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్‌ మెయిన్‌ కెమెరాను అందించారు. సోనీ ఐఎమ్‌ఎక్స్‌890 సెన్సర్‌ కెమెరాను ఇచ్చారు. కవర్‌ డిస్‌ప్లేలోనే వైఫై, మొబైల్‌ డేటా, ఫ్లైట్ మోడ్‌, బ్లూటూత్‌, నోటిఫికేషన్‌ అలర్ట్స్‌, పవర్‌ సేవింగ్ మోడ్‌ వంటివి ఆపరేట్‌ చేసుకోవచ్చు.

4 / 5
ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ను టెస్టింగ్‌లో భాగంగా 4 లక్షలసార్లు ఫ్లిప్‌ ఓపెన్‌, క్లోజ్‌ చేశారు. అంటే పదేళ్లపాటు రోజుకు 100 సార్లు స్మార్ట్‌ ఫోన్‌ను ఓపెన్‌, క్లోజ్‌ చేసిన దాంతో సమానమన్నమాట. -20 డిగ్రీల సెంటిగ్రేడ్‌ నుంచి 50 డిగ్రీల సెంటిగ్రేడ్‌ లాంటి కండిషన్స్‌లోనూ ఈ ఫోన్‌ పనిచేసేలా రూపొందించారు.

5 / 5
బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 4300 ఎమ్‌ఏహెచ్‌ వంటి పవర్‌ ఫుల్‌ బ్యాటరీని అందించారు. ఈ ఫోన్‌లో 44 వాట్స్‌తో కూడిన సూపర్‌వూక్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీని అందించారు. దీంతో ఈ స్మార్ట్‌ ఫోన్‌ కేవలం 42 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది.