Oppo pad 3: స్టైలిష్‌ లుక్‌, స్టన్నింగ్‌ ఫీచర్స్‌.. ఒప్పో నుంచి అదిరిపోయే ట్యాబ్‌..

|

Nov 29, 2024 | 9:33 PM

ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌లకు సమానంగా ట్యాబ్లెట్స్‌కి ఆదరణ లభిస్తోంది. దీంతో ఎలక్ట్రానిక్‌ దిగ్గజ సంస్థలన్నీ ట్యాబ్స్‌ను లాంచ్‌ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ ఒప్పో మార్కెట్లోకి కొత్త ట్యాబ్‌ను తీసుకొచ్చింది. ఒప్పో ప్యాడ్‌ 3 పేరుతో లాంచ్‌ చేసిన ఈ ట్యాబ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఒప్పో మార్కెట్లోకి కొత్త ట్యాబ్‌ను తీసుకొచ్చింది. ఒప్పో పాడ్‌ 3 పేరుతో చైనా మార్కెట్లోకి ఈ ట్యాబ్‌ను లాంచ్‌ చేశారు. తక్కువ ఫీచర్లతో కూడిన ఈ ట్యాబ్‌ను తీసుకొచ్చారు. త్వరలోనే భారత మార్కెట్లోకి ఈ ట్యాబ్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

2 / 5
ఫీచర్ల విషయానికొస్తే ఒప్పో ప్యాడ్‌ 3లో 11.61 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. 2800x2000 పిక్సెల్‌ రిజల్యూషన్‌, 144Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్, 480Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో పాటు 700 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

3 / 5
ఈ ట్యాబ్‌లో ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్‌ను అందించారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ ట్యాబ్‌లో 9510 ఎమ్‌ఏహెచ్ కెపాసిటీతో కూడిన బ్యాటరీని అందించారు. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

4 / 5
కెమెరా విషయానికొస్తే పాడ్‌ 3లో 8 మెగాపిక్సెల్స్‌ రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 8 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. 67 వాట్స్‌ సూపర్‌వూక్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 9510 ఎమ్‌ఏహెచ్‌ కెపాసిటీ బ్యాటరీని ఇచ్చారు.

5 / 5
కనెక్టివిటీ పరంగా చూస్తే ఇందులో Wi-Fi 6, బ్లూటూత్ 5.4, NFC, USB టైప్-C పోర్ట్‌ వంటి ఫీచర్లను అందించారు. ధర వియానికొస్తే 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 24,400, 8 జీబీ ర్యామ్‌ 256 జీబీ స్టోరేజ్‌ ధర ర. 27,890, 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 33,690, 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 36,015గా నిర్ణయించారు.