OnePlus Nord 4: 28 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్‌… వన్‌ప్లస్‌ నుంచి కొత్త ఫోన్‌

|

Jul 17, 2024 | 11:10 PM

అటు ప్రీమియం బడ్జెట్‌తో పాటు, తక్కువ బడ్జెట్‌తో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్న వన్‌ప్లస్‌ తాజాగా మార్కెట్లోకి మిడిల్‌ రేంజ్‌ బడ్జెట్‌లో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. వన్‌ప్లస్‌ నార్డ్‌4 పేరుతో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. వన్‌ప్లస్‌ నార్డ్‌ 3కి కొనసాగింపుగా, ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వన్‌ప్లస్‌ నార్డ్‌ 4 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రీ ఆర్డర్‌లు ప్రారంభమైన ఈ ఫోన్‌ అమ్మకాలు ఆగస్టు 2వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి.

2 / 5
వన్‌ప్లస్ నార్డ్‌4 స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.74 ఇంచెస్‌తో కూడిన 1.5 కే రిజల్యూషన్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. 1,240x2,772 పిక్సెల్‌ రిజల్యూషన్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఇక ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్‌ 14.1తో పనిచే్సతసుంది.

3 / 5
ఈ స్మార్ట్ ఫోన్‌ ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 7+ జెన్‌ 3 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. ఇక బ్యాటరీకి పెద్ద పీట వేసిన ఈ ఫోన్‌లో 100 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే  5,500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఈ ఫోన్‌ పూర్తి ఛార్జ్‌ కావడానికి కేవలం 28 నిమిషాలు పడుతుందని కంపెనీ చెబుతోంది.

4 / 5
ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 16 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఈ కెమెరాతో 4కే వీడియోను రికార్డ్ చేసుకోవచ్చు.

5 / 5
ధర విషయానికొస్తే 8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.29,999, 8GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ.32,999, 12GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ.35,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను మెర్క్యురియల్ సిల్వర్, ఒయాసిస్ గ్రీన్, అబ్సిడియన్ మిడ్‌నైట్ కలర్స్‌లో తీసుకొచ్చారు.