- Telugu News Photo Gallery Technology photos Nothing planning to developing its own operating system carl pei says
Nothing OS: కీలక నిర్ణయం తీసుకున్న నథింగ్.. హువావే దారిలోనే ఈ కంపెనీ కూడా..
ప్రస్తుతం టెక్ మార్కెట్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు శాసిస్తోన్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇవే మొదటి స్థానంలో ఉన్నాయి. అయితే వీటికి పోటిగా కొత్త ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో కొన్ని సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నథింగ్ సొంత ఆపరేటింగ్ సిస్టమ్‌ను తీసుకొస్తోంది..
Updated on: Nov 02, 2024 | 9:37 PM

లండన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంటోంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్‌లకు చెక్ పెట్టేందుకు అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు ఉన్న ఫోన్‌లే అధికమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే ఇటీవల చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ హువావే సొంతం ఆపరేటింగ్ సిస్టమ్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. హార్మీనీ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హువావే యాప్ గ్యాలరీ ద్వారా యాప్స్ డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది.

అయితే ఇప్పుడు ఈ జాబితాలోకి నథింగ్ కూడా వచ్చి చేరుతోంది. సొంతంగా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) రూపొందించాలని భావిస్తున్నట్లు నథింగ్ ఫౌండర్ కార్ల్ పై చెప్పారు. టెక్ క్రంచ్ అనే సంస్థ నిర్వహించిన సదస్సులో కార్ల్ పై మాట్లాడుతూ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ రూపకల్పనకు గల అవకాశాలను పరిశీలిస్తున్నామని అన్నారు.

సొంత ఓఎస్ రూపొందించడం ద్వారా తాము అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని ఆలోచిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఫీచర్లను జోడిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.

ఇలా సొంతంగా ఆపరేటింగ్ సిస్టమ్ డిజైన్ చేయడం ద్వారా యూజర్లకు మెరుగైన ఎక్స్ పీరియన్స్ అందించడానికి వీలవుతుందన్నారు. తమకు నిధుల కొరత ఉన్నా.. తమ కంపెనీ ఈ ఓఎస్ అభివృద్ధిపై పని చేయగలదన్నారు. మరి ఈ ట్రెండ్ నథింగ్‌తోనే ఆగిపోతుందా.? ఇతర కంపెనీలు కూడా ఇదే ఫాలో అవుతాయా చూడాలి.




