CMF Phone 1: ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌.. నథింగ్‌ నుంచి బడ్జెట్ ఫోన్ వచ్చేస్తోంది.

|

Jul 08, 2024 | 10:05 AM

లండన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ నథింగ్‌కు వరల్డ్‌ వైడ్‌గా మంచి పాపులారిటీ ఉన్న విషయం తెలిసిందే. ఈ బ్రాండ్‌ నుంచి వచ్చిన ఫోన్‌లు ఇప్పటి వరకు భారీగా అమ్మకాలు జరుపుకున్నాయి. అయితే తాజాగా నథింగ్‌ నుంచి ఓ బడ్జెట్‌ ఫోన్‌ మార్కెట్లోకి వస్తోది. ఇంతకీ ఏంటా ఫోన్‌.? ఎలాంటి ఫీచర్లు ఉంటాయి.? లాంటి వివరాలు..

1 / 5
నథింగ్ సబ్‌ బ్రాండ్‌ అయిన సీఎమ్‌ఎఫ్‌ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. సీఎమ్‌ఎఫ్‌ ఫోన్‌1 పేరు జులై8వ తేదీ మధ్యాహ్నం ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఈ నేథ్యంలో ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
సీఎమ్‌ఎఫ్‌ ఫోన్‌1లో 6.67 ఇంచెస్‌తో కూడిన సూపర్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో పాటు హెచ్‌డీ10+ సపోర్ట్‌తో ఈ ఫోన్‌ రానుంది. ఇక ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 చిప్‌పెస్‌ ప్రాసెసర్‌తో పనిచేయనుంది.

3 / 5
ఇక ఈ ఫోన్‌లో ఐపీ52 రేటింగ్‌తో డస్ట్‌, లైట్‌ స్ల్పాషెస్‌ను తట్టుకునేలా డిజైన్‌ చేశారు. ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ను అందించనున్నారు. 128 బీజీ స్టోరేజ్‌ కెపాసిటీతో రానున్న ఈ ఫోన్‌లో ఇంటర్నల్ మెమోరీని 2 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఇక ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

4 / 5
 రెండేళ్లపాటు ఆపరేటింగ్ సిస్టమ్‌ అప్‌డేట్స్‌తో ఈ ఫోన్‌ రానుంది. ఇక మూడేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను ఇవ్వనున్నారు కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించనున్నారు.

5 / 5
బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 33 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు ధర పరంగా చూస్తే 6 జీబీ ర్యామ్‌ 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 15,999కాగా.. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 17,999గా ఉండొచ్చని అంచనా.