ఒకప్పుడు మొబైల్ ప్రపంచాన్ని ఏలిన నోకియా ఆ తర్వాత స్మార్ట్ ఫోన్ పోటీలో పెద్దగా రాణించలేకపోయింది. అయితే తాజాగా మళ్లీ పుంజుకొని కొంగొత్త ఫోన్‌లను విడుదల చేస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా ఎక్స్‌ఆర్20 పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ ప్రీ బుకింగ్ అక్టోబర్ 20 నుంచి ప్రారంభమవుతుంది. 6జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో రిలీజ్ చేసిన ఈ ఫోన్ ధర రూ. 46,999గా ఉంది.
సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌ను వాటర్‌ప్రూఫ్, షాక్‌ప్రూఫ్ బాడీతో రూపొందించారు. నీటిలో ముంచినా, మట్టిలో పడిపోయినా ఏమీ కాని విధంగా దీనిని తయారు చేశారు.
కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 48 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.
ఈ ఫోన్‌లో 4630ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 18వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
గరిష్టంగా 55 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 20 డిగ్రీల సెల్సియస్ వాతావరణంలో కూడా పనిచేయడం ఈ ఫోన్ మరో ప్రత్యేకత.