
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటోరోలో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ మోటో జీ54పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. మోటో జీ54 బేస్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 15,999గా ఉండగా తాజాగా ఏకంగా రూ. 3వేలు డిస్కౌంట్ అందిస్తోంది.

దీంతో ఈ ఫోన్‌ను రూ. 12,999కే సొంతం చేసుకునే అవకాశం లభించింది. ఇక 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ స్మార్ట్ ఫోన్ డిస్కౌంట్ తర్వాత రూ.15,999లకు లబిస్తోంది. అయితే ఈ ఆఫర్ ఎంతకాలం ఉంటుందనే దానిపై కంపెనీ స్పష్టత ఇవ్వలేదు.

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.5-అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లేను అందించారు. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ఎస్వోసీ చిప్ సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోణ్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇచ్చారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ -13 విత్ మై యూఎక్స్ 5.0 వర్షన్‌పై పని చేస్తుంది. ఈ ఫోన్‌లో మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో స్టోరేజీని ఒక టిగా బైట్ వరకూ పొడిగించుకోవచ్చు. ఛార్జింగ్ విషయానికొస్తే.. 33వాట్ల టర్బో పవర్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది.