
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం మోటరోలా తాజాగా మార్కెట్లోకి మోటో జీ14 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ను ఆగస్టు 1వ తేదీన లాంచ్ చేయనున్నారు.

బ్లూ, గ్రే కలర్స్‌లో అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 9999 ఉండొచ్చని అంచనా. త్వరలోనే ధరకు సంబంధించి అధికారిక ప్రటకన రానుంది.

ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించనున్నారు. ఆక్టాకోర్ యూనిసోక్ టీ616 ఎస్వోసీ చిప్ సెట్ ఈ స్మార్ట్ ఫోన్ సొంతం.

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో మూడేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తారు. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు.

ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మా్ర్ట్ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు. అలాగే 20 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 34 గంటల టాక్‌టైమ్ ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకత.