
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటారోలా కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. మోటారోలా ఎడ్జ్ 50 ప్రో పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఈ ఫోన్ లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇక మోటో ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన 1.5కే పీఓల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ డిస్‌ప్లే సొంతం.

ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్‌స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ను అందించారు. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను ఇందులో అందించారు.

ఇక ఈ ఫోన్‌లో కార్నింగ్ గొరిల్లా 5 ప్రొటెక్షన్‌తో స్క్రీన్‌ను ఇచ్చారు. అలాగే ఛార్జింగ్ విషయానికొస్తే ఇందులో 125వాట్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు, 50 వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్కు సపోర్ట్ చేసే 4500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.

కెమెరా విషయానికొస్తే మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరాను అందించనున్నారు. సెల్ఫీ కెమెరాకు సంబంధించి కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక ధరపై కూడా త్వరలోనే ప్రకటన చేయనున్నారు.