Motorola edge 50 neo: మోటో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. మార్కెట్లోకి వచ్చేది ఎప్పుడంటే..

|

Sep 16, 2024 | 4:02 PM

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌కు సిద్ధమవుతోన్న తరుణంలో స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలు మార్కెట్లోకి కొత్త ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటోరోలా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. మోటోరోలా ఎడ్జ్‌ 50 నియో పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ ఫోన్‌కు సంబంధించి పూర్తి వివరాలు..

1 / 5
 ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటోరోలా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. మోటోరోలా ఎడ్జ్‌ 50 నియో పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. ఈ ఫోన్‌ తొలి సేల్‌ను సెప్టెంబర్‌ 24వ తేదీ ప్రారంభంకానుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ లో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది.

2 / 5
 ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.4 ఇంచెస్‌తో కూడిన సూపర్‌ హెచ్‌డీ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 Hz రిఫ్రెష్ రేట్‌, 2800 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్ ఈ స్క్రీన్‌ సొంతం. దీంతో ఈ ఫోన్‌ స్క్రీన్‌ సన్‌లైట్‌లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది.

3 / 5
ఇక ఈ ఫోన్‌లో ఐపీ68 రేటింగ్‌తో కూడిన వాటర్‌ అండ్‌ డస్ట్‌ రెసిస్టెంట్‌ను అందించారు. 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌ను అందించారు.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కెమెరా సెటప్‌ను ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

5 / 5
మోటోరోలా ఎడ్జ్‌ 50 నియో బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 68 వాట్స్‌ టర్బో ఛార్జింగ్‌, 15 వాట్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4310 ఎమ్‌ఏహెచ్‌ కెపాసిటీ గల బ్యాటరీని అందించారు. ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్లను అందించారు. ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 22,999గా నిర్ణయించారు.