Motorola Edge 40 Neo: రూ. 20 వేలలో 50 ఎంపీ కెమెరా.. మోటోరోలా కొత్త ఫోన్‌ వచ్చేసింది..

|

Oct 01, 2023 | 9:32 PM

పండుగల నేపథ్యంలో కంపెనీలు వరుసగా ఫోన్‌లను లాంచ్‌ చేస్తూ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకుంటూ మార్కెట్లోకి కొత్త ఫోన్స్‌ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటోరోలా మార్కెట్లోకి బడ్జెట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. మోటో ఎడ్జ్‌ 40 నియో పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

1 / 5
 మోటోరోలో ఎడ్జ్‌ 40 నియో పేరుతో మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేశారు. ఈ ఫోన్‌ను 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 12 జీబీ ర్యామ్‌, 256 స్టోరేజ్‌ వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. ఫెస్టివల్ సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌లపై రూ. 3 వేలు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.

2 / 5
ధర విషయానికొస్తే 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 20,999 కాగా, 12 జీబీ ర్యామ్‌, 256 స్టోరేజ్‌ వేరియంట్‌ ఫోన్‌ ధర రూ. 22,999గా ఉంది. ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోణ్లో 6.55 ఇంచెస్‌తో కూడన ఫుల్‌ హెచ్‌డీ+ కర్వ్‌డ్‌ డిస్‌ప్లేను అందించారు.

3 / 5
ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ను అందించారు. ఐపీ68 వాటర్‌, డస్ట్ రెసిస్టెన్స్‌ రేటింగ్ ఈ స్మార్ట్ ఫోన్‌ ప్రత్యేకత. ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 ఎంపీ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

4 / 5
ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7030 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. మోటోరోలా ఎడ్జ్‌ 40 నియోలో 68 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పని చేస్తుంది.

5 / 5
5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎన్‌ఎఫ్‌సీ, స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మోస్‌ సపోర్ట్ వంటి ఫీచర్స్‌ ఉన్నాయి. ఈ ఫోన్‌ బ్లాక్‌ బ్యూటీ, సూతింగ్‌ సీ, కెనీల్‌ బే కలర్స్‌లో అందుబాటులో ఉంది.