- Telugu News Photo Gallery Technology photos Microsoft introducing new virtual technology mesh can bring reality
Microsoft Mesh: లేనిది ఉన్నట్లు చూపించే కొత్త మాయాలోకం.. వర్చువల్ రియాలిటీలో మరో అడుగు ముందుకేసిన మైక్రోసాఫ్ట్.
Microsoft Mesh: లేనిది ఉన్నట్లు చూపించే వర్చువల్ రియాలిటీ టెక్నాలజీలో మైక్రోసాఫ్ట్ మరో ముందడుగు వేసింది. ఈ క్రమంలోనే 'మెష్' పేరుతో ఓ సరికొత్త టెక్నాలజీకి నాంది పలికింది. దీని ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఉన్న వ్యక్తి అయినా మన పక్కనే ఉండి మాట్లాడుతున్నట్లు భ్రమ కలుగుతుంది.
Updated on: Mar 06, 2021 | 8:05 AM

ప్రస్తుతం వర్చువల్ రియాలిటీ టెక్నాలజీపై చాలా టెక్ కంపెనీలు దృష్టిసారిస్తున్నాయి. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ మరో ముందుకేసి మైక్రోసాఫ్ట్ 'మెష్' తీసుకొచ్చింది.

యూజర్లకు మిక్స్‌డ్ రియాలిటీ అనుభూతి కలిగించే క్రమంలో తీసుకొస్తున్న ఈ సరికొత్త టెక్నాలజీతో లేనిది ఉన్నట్లు భ్రమ కలుగుతుంది.

ఈ టెక్నాలజీతో ఇకపై ఆఫీసు టీమ్ సభ్యులు ఎక్కడో ఉండి కూడా పక్కపక్కనే ఉన్నట్లు సమావేశాలు నిర్వహించుకోవచ్చు.

మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ అజ్యూర్ సహాయంతో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న వారు వివిధ డివైజ్‌లతో కనెక్ట్ అయి హోలోగ్రాఫిక్ ఎక్స్‌పీరియన్స్‌ను పొందొచ్చు.

మొబైల్, ట్యాబ్, కంప్యూటర్లు, వీఆర్‌హెడ్‌సెట్లు వంటి పరికరాలతో ఎక్కడి నుంచైనా అందరూ కనెక్ట్ అవ్వొచ్చని మైక్రోసాఫ్ట్ తెలిపింది.

వర్చువల్ రియాలిటీలో రానున్న ఈ సరికొత్త టెక్నాలజీ ఎలాంటి సంచలనాలకు తెర తీస్తుందో చూడాలి.




