Twitter IPL: ఐపీఎల్‌ లవర్స్‌ కోసం ట్విట్టర్‌ కొత్త ఫీచర్‌.. లైవ్‌ అప్‌డేట్స్‌తో పాటు మరెన్నో..

|

Mar 31, 2022 | 5:11 PM

Twitter IPL: ప్రస్తుతం భారత్‌లో ఐపీఎల్‌ ఫీవర్‌ నడుస్తోంది. క్రికెట్‌ లవర్స్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌లను ఎంతో ఆసక్తికగా వీక్షిస్తున్నారు. ఇలాంటి క్రికెట్‌ అభిమానుల కోసమే ట్విట్టర్‌ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ సహాయంతో యూజర్లు...

1 / 5
భారతీయులను, క్రికెట్‌ను వేరు చేసి చూడలేం. క్రికెట్‌ అంటే ఇండియన్స్‌కు ఎక్కడలేని ఆసక్తి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఐపీఎల్‌ సీజన్‌కు భారత్‌లో ఉండే క్రేజ్‌ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఈ క్రేజ్‌ను ఉపయోగించుకొనే ట్విట్టర్‌ ఐపీఎల్‌ ఫ్యాన్స్‌ కోసం సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.

2 / 5
 ట్విట్టర్ తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ సహాయంతో యూజర్లకు పుష్‌ నోటిఫికేషన్స్‌ ద్వారా ఎప్పటికప్పుడు ఐపీఎల్‌ మ్యాచ్‌ల వివరాలత పోటు లైవ్‌ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

3 / 5
కేవలం స్కోర్‌ వివరాలే కాకుండా లేటెస్ట్‌ ఐపీఎల్‌ మ్యాచ్ల వివరాలు, స్కోర్‌ కార్డుల వివరాలను అందిస్తుంది. ఎక్స్‌ప్లోర్‌ పేజీలో ఉండే క్రికెట్‌ టాబ్‌ను క్లిక్‌ చేస్తే కొత్త పేజ్‌ ఓపెన్‌ అవుతుంది. ఇందులో మ్యాచ్‌లకు సంబంధించిన వివరాలను లైవ్‌లో చూడొచ్చు.

4 / 5
 టీమ్‌ విడ్జెట్స్‌లో టాప్ ప్లేయర్స్‌, జట్టు ర్యాంకింగ్‌లు, అత్యధిక స్కోర్లు వంటి వివరాలు తెలుసుకోవచ్చు. మ్యాచ్ జరుగుతుండగానే ఈ ర్యాంకింగ్ వివరాలు అప్‌డేట్ అవుతుంటాయి.

5 / 5
కేవలం డేటాకే పరిమితం కాకుండా క్రికెట్‌కు సంబంధించి వీడియోలను తీసుకొచ్చేందుకు ట్విట్టర్‌ ప్రయత్నిస్తోంది. ముఖ్యమైన ఈవెంట్స్, హైలెట్స్, కీలకమైన మూమెంట్స్ లాంటివి షార్ట్ వీడియోల రూపంలో అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.