
పానాసోనిక్ టీవీలోని 4 కే పిక్చర్ ప్రాసెసర్, 60 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ కారణంగా పిక్చర్ నాణ్యత పెరుగుతుంది. వైడ్ వ్యూయింగ్ యాంగిల్, 20 డబ్ల్యూ అవుట్‌పుట్‌తో కూడిన డాల్బీ డిజిటల్ సౌండ్ కారణంగా థియేటర్ లో కూర్చున్న అనుభవం కలుగుతుంది. త్రీ హెచ్ డీఎంఐ, రెండు యూఎస్ బీ పోర్టులు, బ్లూటూత్, గూగుల్ అసిస్టెంట్‌తో తదితర కనెక్టివిటీ ఎంపికలున్నాయి. పానాసోనిక్ 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధర: రూ. 31,990.

ఏసర్ 139 సీఎం (55 అంగుళాలు) 4 కే ఎల్ఈడీ లెడ్ టీవీలోని లేటెస్ట్ టెక్నాలజీతో స్పష్టమైన విజువల్ స్పష్టంగా ఉంటుంది. 4కే అల్ట్రా హెచ్ డీ రిజల్యూషన్, డాల్బీ విజన్, హెచ్ డీఆర్10 సపోర్ట్‌తో ఆకట్టుకుంటోంది. అంతర్నిర్మిత క్రోమోకాస్ట్, గూగుల్ అసిస్టెన్స్ ఫీచర్లతో పాటు డాల్బీ అట్మోస్‌తో కూడిన 36 డబ్ల్యూ హై-ఫిడిలిటీ స్పీకర్లు, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, బహుళ హెచ్ డీఎంఐ,యూఎస్ బీ పోర్ట్‌లు ఏర్పాటు చేశారు. ఏసర్ 55 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.32,999.

హైయర్ 80 సీఎం స్మార్ట్ టీవీలో వివిధ రకాల కనెక్టివిటీ ఎంపికలు ఉన్నాయి. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మంచి రిజల్యూషన్‌తో పనితీరు చాల బాగుంటుంది. డోలీ ఆడియోతో ధ్వని చాలా స్పష్టంగా వినపడుతుంది. థియేటర్ లో సినిమా చూసిన అనుభవం కల్పిస్తుంది. హైయర్ 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.13,490.

రెడ్‌మీ టీవీపై అమెజాన్ లో సేల్ లో 54 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. అంతర్నిర్మిత 20 డబ్ల్యూ స్పీకర్లు, డాల్బీ అట్మోస్ ఆడియో, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజీతో రెడ్ మీ 32 అంగుళాల స్మార్ట్ టీవీ ఆకట్టుకుంటోంది. 64 బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో ఎలాంటి అంతరాయం లేకుండా నచ్చిన ప్రోగ్రామ్ లను చూడవచ్చు. ఈ టీవీ రూ.11,499కు అందుబాటులో ఉంది.

సామ్సంగ్ కంపెనీ విడుదల చేసిన ఈ 32 అంగుళాల స్టార్ట్ టీవీలో డాల్బీ డిజిటల్ ప్లస్‌తో త్రీడీ సౌండ్ ఎఫెక్ట్ ఆకట్టుకుంటుంది. పూర్తి హెచ్ డీ, 50 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కారణంగా చిత్రాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. దీనిలోని మైక్రో డిమ్మింగ్ ప్రో మోడ్ టీవీ స్క్రీన్‌లను జోన్‌లుగా విభజిస్తుంది. చిత్రాలను నాణ్యతతో చూపడం వల్ల కంటికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఈ సామ్సంగ్ స్మార్ట్ టీవీ ధర రూ.26,990.