
ప్రముఖ సంస్థ లెనోవో తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ట్యాబ్‌ను లాంచ్ చేసింది. లెనోవో ట్యాబ్ ఎమ్10 ప్లస్ (3rd gen) పేరుతో తీసుకొచ్చిన ఈ ట్యాబ్‌లో అదిరిపోయే ఫీచర్లను అందించారు.

10.61 ఇంచెస్‌తో కూడిన భారీ 2కే డిస్‌ప్లే ఈ ట్యాబ్ ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ట్యాబ్ వైఫై, సిమ్‌కి సపోర్ట్ చేసే వెర్షన్స్‌లో ఇచ్చారు.

స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ట్యాబ్‌లో పిల్లల కోసం ప్రత్యేకమైన కంటెంట్ ఫిల్టర్స్, సెఫ్టీ కంట్రోల్స్, ప్రైవసీ సపోర్ట్ ఉండే గూగుల్ కిడ్స్ స్పేస్‌ను అందించింది.

కెమెరా విషయానికొస్తే ఈ ట్యాబ్‌లో 8 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం కూడా 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. డాల్బీ అట్మోస్ టెక్నాలజీకి సపోర్ట్ చేసే నాలుగు స్పీకర్లను ఇచ్చారు.

ధర విషయానికొస్తే ఈ ట్యాబ్ వైఫై ఓన్లీ మోడల్ ధర రూ.19,999గా ఉంది. వైఫై+LTE వేరియంట్ రూ.21,999 ధరకు అందుబాటులోకి వచ్చింది.