Lenovo tab k11: మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌.. అదిరిపోయే ఫీచర్స్‌.. లెనోవో నుంచి సూపర్ ట్యాబ్‌

|

May 09, 2024 | 8:10 PM

ప్రస్తుతం మార్కెట్లో ట్యాబ్లెట్స్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. చాలా మంది గేమ్‌ లవర్స్‌, మూవీ లవర్స్‌ ల్యాప్‌టాప్‌కి బదులుగా ట్యాబ్లెట్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ కంపెనీలన్నీ వరుసగా ట్యాబ్లెట్స్‌ను లాంచ్‌ చేస్తూ వస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం లెనొవో మార్కెట్లోకి కొత్త ట్యాబ్‌ను లాంచ్‌ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

1 / 5
ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం లెనోవో భారత మార్కెట్లోకి తాజాగా కొత్త ట్యాబ్‌ను లాంచ్‌ చేసింది. లెనోవో ట్యాబ్‌ కే11 పేరుతో తీసుకొచ్చిన ఈ ట్యాబ్‌ను మిడ్ రేంజ్‌ బడ్జెట్‌లో లాంచ్‌ చేశారు. ఇంతకీ ఈ ట్యాబ్‌లో ఎలాంటి ఫీచర్ల ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
లెనోవో ట్యాబ్‌ కే11లో మీడియాటెక్ హెలియో జీ88 ఎస్వోసీ చిప్ సెట్ ప్రాసెసర్‌ను అందించారు. ఈ ట్యాబ్‌ను 8జీబీ ర్యామ్, 128 జీబీ ఆన్ బోర్డు స్టోరేజీతో తీసుకొచ్చారు. డోల్బీ ఆట్మోస్ టెక్నాలజీతో క్వాడ్ స్పీకర్లు ఈ ట్యాబ్‌ ప్రత్యేకత. ఇక ఇందులో 7040 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందించారు.

3 / 5
ధర విషయానికొస్తే 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.17,990గా, 8జీబీ ర్యామ్.. 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,990గా నిర్ణయించారు. ఈ ట్యాబ్‌ను లునా గ్రే, సీఫోమ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్‌లో లాంచ్‌ చేశారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఈ ట్యాబ్‌ పనిచేస్తుంది.

4 / 5
లెనోవో టాబ్ కే11 ట్యాబ్‌లో 10.95 ఇంచెస్‌తో కూడిన ఎల్‌సీడీ స్క్రీన్‌ను ఇచ్చారు. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌, 1200×1920 పిక్సెల్స్ ఈ స్క్రీన్ సొంతం. ఇక ట్యాబ్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 10 గంటల వీడియో ప్లే బ్యాక్‌ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

5 / 5
కెమెరా విషయానికొస్తే లెనోవో ట్యాబ్‌ కే11లో 13 మెగా పిక్సెల్స్‌తో కూడి రెయిర్‌ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. వై-ఫై 802.11, బ్లూటూత్ 5.1, 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్ సీ పోర్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.