Lava Blaze 2 5G: రూ. 10 వేలలోనే 5జీ స్మార్ట్‌ ఫోన్‌.. లావా నుంచి మరో స్టన్నింగ్ ఫోన్‌..

|

Oct 26, 2023 | 10:11 AM

దేశంలో 5జీ నెట్‌వర్క్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో 5జీ ఫోన్స్‌కు గిరాకీ పెరుగుతోంది. అయితే ప్రారభంలో అధికంగా ఉన్న 5జీ హ్యాండ్‌సెట్ ధరలు ప్రస్తుతం భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో అత్యంత తక్కువ ధరకే 5జీ ఫోన్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా లావా కేవలం రూ. 10 వేలలోనే బెస్ట్ బడ్జెట్‌ 5జీ ఫోన్‌ను తీసుకొస్తోంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఇప్పుడు చూద్దాం..

1 / 5
భారత్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా మార్కెట్లోకి కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. లావా బ్లేజ్‌ 2 పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకురానున్నారు. ఈ స్మార్ట్ ఫోన్‌ ధర రూ. 9 నుంచి రూ. 10 వేల మధ్య ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు. త్వరలోనే ధరకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.

2 / 5
ఇక కంపెనీ ఇప్పటి వరకు ఫీచర్లకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ నెట్టింట లీక్‌ అయిన సమాచారం ఆధారంగా ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్స్‌ ఉన్నాయంటే. ఈ ఫోన్‌ను ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారని సమాచారం. ఇక ఇందులో సెంటర్ పంచ్‌ హోల్‌ను ఇవ్వనున్నారని సమాచారం.

3 / 5
ఇక లావా బ్లేజ్‌ 5జీకి కొనసాగింపుగా వస్తున్న ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6020 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పని చేయనుంది. ఈ ఫోన్‌ను రెండు స్టోరేజ్‌ వేరియంట్స్‌ తీసుకురానున్నారని సమాచారం. 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌తో రానుంది.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడా ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు. ఇక సెల్ఫీల కోసం ఇందులో 8 మెగాపిక్సెల్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నట్లు తెలుస్తోంది.

5 / 5
ఈ నెల చివర్లో లేదా వచ్చే నెల ప్రారంభంలో ఈ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 18 వాట్స్‌ వైర్డ్‌ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించనున్నారు.