Lava Yuva 5G: రూ. 10 వేలలోనే 5జీ స్మార్ట్‌ ఫోన్‌.. లావా కొత్త ఫోన్‌ వచ్చేసింది

|

May 31, 2024 | 4:48 PM

ప్రస్తుతం దేశంలో 5జీ నెట్‌వర్క్‌ శరవేగంగా విస్తరిస్తోంది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన పట్టణాల్లో ఇప్పటికే 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే గ్రామీణ ప్రాంతాల్లోనూ 5జీ అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ ధరలో 5జీ ఫోన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే లావా భారత మార్కెట్లోకి కొత్త 5జీ ఫోన్ ను తీసుకొచ్చింది..

1 / 5
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 5జీ సేవలు విస్తరిస్తున్న నేపథ్యంలో స్మార్ట్‌ ఫోన్‌ తయారీ కంపెనీలు మార్కెట్లోకి కొంగొత్త 5జీ ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌ను టార్గెట్ చేసుకొని కొత్త ఫోన్‌లను తీసుకొస్తున్నారు .ఈ క్రమంలోనే లావా కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది.

2 / 5
భారత్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ తయారీ సంస్థ లావా భారత మార్కెట్లోకి కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. కేవలం రూ. 10వేలలోనే 5జీ ఫోన్‌ను తీసుకొచ్చిందీ కంపెనీ. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

3 / 5
లావా యువ 5జీ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.52 ఇంచెస్‌తో కూడి ఎల్‌సీడీ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ యూనిసోక్‌ టీ750 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

4 / 5
ఇందులో 18 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పినిచేస్తుంది. ఓఎస్‌ అప్‌డేట్, రెండేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

5 / 5
కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 9,499 కాగా, 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 9,999గా నిర్ణయించారు. జూన్‌ 5వ తేదీ నుంచి అమ్మకాలు జరగనున్నాయి.