iQOO 11: భారత్‌లో అందుబాటులోకి వచ్చేసిన ఐక్యూ 11 స్మార్ట్‌ఫోన్‌.. ఏం ఫీచర్లు గురూ..

|

Jan 14, 2023 | 12:47 PM

టెక్‌ అభిమానులు ఎన్నటి నుంచో ఎదురు చూస్తోన్న ఐక్యూ 11 భారత మార్కెట్లోకి వచ్చేసింది. ప్రీమియం బడ్జెట్‌లో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ అమెజాన్‌ ప్లాట్‌ఫామ్‌లో జనవరి 13వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది..

1 / 5
 చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం ఐక్యూ భారత మార్కెట్లోకి ఐక్యూ 11 స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా జనవరి 13వ తేదీ నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌లో అందుబాటులోకి వచ్చింది.

2 / 5
ఐక్యూ 11 8 జీబీ ర్యామ్‌+256 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 59,999గా ఉండగా, 16 జీబీ ర్యామ్‌ + 256 జీబీ స్టోరేజ్‌ వేరయింట్ ధర రూ. 64,999గా ఉంది. అయితే ఆఫర్‌లో భాగంగా డిస్కౌంట్‌కి లభిస్తోంది. అమెజాన్‌ ప్రైమ్‌లో రూ. 1000 ఫ్లాట్ డిస్కౌంట్‌ పొందొచ్చు.

3 / 5
ఇక ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.78 ఇంచెస్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టుతో 2K E6 ప్యానెల్‌తో వస్తోన్న తొలి మొబైల్ ఇదే కావడం విశేషం.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. 50 మెగాపిక్సెల్‌ సామ్‌సంగ్‌ GN5 లెన్స్, 13-MP టెలిఫోటో లెన్స్, 8-MP అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో, స్పాట్‌లెస్ సెల్ఫీలను క్యాప్చర్ చేసేందుకు 16 మెగాపిక్సెల్‌ స్నాపర్‌ను అందించారు.

5 / 5
బెస్ట్ గేమింగ్ అనుభూతిని అందించేందుకు డ్యూయల్ x-లీనియర్ మోటార్‌ను అందించారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5000mAh బ్యాటరీని అందించారు.