Instagram: అదిరిపోయే ఫీచర్స్‌ తీసుకొస్తున్న ఇన్‌స్టాగ్రామ్‌… వీటి ఉపయోగం ఏంటంటే.

|

Nov 17, 2023 | 6:42 PM

సోషల్‌ మీడియా సైట్స్‌లో సరికొత్త విప్లవాన్ని సృష్టించింది ఇన్‌స్ట్రాగ్రామ్‌. ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న సోషల్‌ మీడియా సైట్స్‌లో ఒకటిగా నిలిచిన ఈ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు మారుతోన్న టెక్నాలజీ అనుగుణంగా ఫీచర్లు తీసుకొస్తోంది కాబట్టే ఇంతటి ఫాలోయింగ్‌ ఉంది. ఇదిలా ఉంటే తాజాగా కొన్ని కొత్త ఫీచర్లను తీసుకొచ్చే పనిలో పడింది ఇన్‌స్టాగ్రామ్‌..

1 / 5
ఇక ఇన్‌స్టాగ్రామ్‌ తీసుకొస్తున్న మరో కొత్త ఫీచర్‌ ఆడియో బ్రౌజర్‌.. ఈ ఫీచర్‌తో కెమెరా రోల్‌పై నుంచి ఆడియో బ్రౌజర్ లేదా ట్రెండింగ్ ఆడియోను ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. తద్వారా రీల్స్‌ కోసం సాంగ్స్, సౌండ్స్, ఎఫెక్ట్స్‌ను బ్రౌజ్ లేదా సెర్చ్ చేయవచ్చు.

2 / 5
ఇన్‌స్టాగ్రామ్‌ తీసుకొస్తున్న ఫీచర్స్‌లో ఫొటో ఫిల్టర్‌ ఒకటి. ఈ ఫీచర్‌ సహాయంతో మీరు తీసిన ఫొటోల క్వాలిటీని మరింత పెంచుకోవచ్చు. కలర్ లీక్, సాఫ్ట్ లైట్ వంటి ఫిల్టర్స్‌ను ఇందులో అందించారు. స్లైడర్‌ ఫీచర్తోతో ప్రతి ఫిల్టర్ ఇంటెన్సిటీని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు.

3 / 5
ఆర్టిఫిషియ్‌ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి.. రీల్స్, స్టోరీస్ కోసం సొంత స్టిక్కర్లను క్రియేట్ చేసుకునే ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ తీసుకొస్తోంది. మెటా సెగ్మెంట్ ఎనీథింగ్ AI మోడల్‌తో స్టిక్కర్లను క్రియేట్ చేసుకోవచ్చు.

4 / 5
ఇక వీడియోలను ఎడిటింగ్ చేసుకునేందుకు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. దీంతో వీడియోలను మరింత సులభంగా ఎడిటింగ్‌ చేసుకోవచ్చు. అన్‌డూ, రీడూ ఫంక్షన్స్‌ జోడించనున్నారు. దీంతో క్రియేటర్లు ఇండివిడ్యువల్ ఫుటేజ్‌ను రొటేట్‌, ట్రిమ్మ్‌, స్కేల్ కూడా చేసుకోవచ్చు.

5 / 5
ఇన్‌స్టాగ్రామ్‌ తీసుకొస్తున్న మరో కొత్త ఫీచర్‌ టెక్ట్స్‌ స్టైల్‌ను మార్చుకునే ఫీచర్‌. దీంతో టెక్స్ట్‌ను ఆరు కొత్త ఫాంట్స్‌, స్టైల్స్‌తో స్టైలిష్‌గా మార్చుకోవచ్చు. ఈ స్టైల్స్‌ కేవలం ఇంగ్లిష్‌ మాత్రమే కాకుండా వందలాది భాషల్లో అందుబాటులో ఉండడం విశేషం.