infinix hot 50 5g: రూ. 10వేలలో మైండ్‌ బ్లోయింగ్ ఫోన్‌.. కళ్లు చెదిరే ఫీచర్స్‌

|

Sep 07, 2024 | 9:48 PM

మార్కెట్లో బడ్జెట్‌ ఫోన్‌ల హవా నడుస్తోంది. తక్కువ బడ్జెట్‌ సెగ్మెంట్‌ను టార్గెట్ చేసుకొని కొంగొత్త ఫోన్స్‌ను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెంది స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్‌ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఇన్‌ఫినిక్స్‌ హాట్‌ 50 పేరుతో తీసుకొచ్చిన ఈ 5జీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్‌ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇన్‌ఫినిక్స్‌ హాట్‌ 50 పేరతుఓ ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. ఈ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్‌తో పాటు మరెన్నో అధునాతన ఫీచర్లను అందించారు.

2 / 5
ఇన్‌ఫినిక్స్‌ హాట్‌ 50 5జీ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఈ స్క్రీన్ సొంతం. ఇక ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ వంటి పవర్‌ ఫుల్ ప్రాసెసర్‌తో పని చేస్తుంది.

3 / 5
ఈ ఫోన్‌ను 4 జీబీ, 8 జీబీ ర్యామ్‌ వేరియంట్‌తో తీసుకొచ్చారు. ఇక స్టోరేజ్‌ విషయానికొస్తే 128 జీబీ స్టోరేజ్‌ను అదించార. ఈ ఫోన్‌లో 18వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ లిథియం ఆయాన్‌ పాలిమర్‌ బ్యాటరీని అందించారు.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 48 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు.

5 / 5
ఇన్‌ఫినిక్స్‌ హాట్‌ 50 5జీ ఫోన్‌ 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ వేరియంట్‌ ధర రూ. 9999గా ఉంది. అలాగే 8 జీబీ ర్యామ్‌, 18 జీబీ వేరియంట్‌ ధర రూ. 10,999గా నిర్ణయించారు. సెప్టెంబర్ 9 నుంచి తొలి సేల్ ప్రారంభం కానుంది. లాంచింగ్‌ ఆఫర్‌లో భాగంగా రూ. 1000 డిస్కౌంట్ లభిస్తుంది.